ప్రపంచ టాప్–100 ప్రభావంత జాబితాలో చోటు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్ తదితర భారతీయ కంపెనీల కమ్యూనికేషన్, మార్కెటింగ్ చీఫ్‌లు.. ప్రోవోక్ మీడియా ‘2025 ప్రపంచ టాప్ 100 ప్రభావవంతమైన నాయకుల జాబితా’లో స్థానం సంపాదించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సమాచార సంబంధాలను గొప్పగా నిర్వహించే వారికి ఇందులో స్థానం కల్పించినట్టు ప్రోవోక్ మీడియా తెలిపింది. కంపెనీ ప్రతిష్టతను పెంచడం, ప్రజలతో సంబంధాల విషయంలో వీరి నిర్ణయాలు ప్రభావం చూపిస్తున్నట్టు తెలిపింది.
రిలయన్స్ గ్రూప్ కమ్యూనికేషన్స్ హెడ్ రోహిత్ బన్సాల్ ఇన్ఫోసిస్ గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అభినవ్ కుమార్ వేదాంత గ్రూప్ చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ రీతు జింగాన్ గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ సుజిత్ పటేల్ జిందాల్ స్టీల్ కార్పొరేట్ బ్రాండ్, కమ్యూనికే షన్‹Ù్స హెడ్ అర్పణ కుమార్ అహుజా
‘‘రిలయన్స్ ఇండస్టీస్ భారత్‌లోనే అతిపెద్ద ప్రైవేటు కంపెనీ.
దేశ ఆర్థిక వ్యవస్థ బూమింగ్‌కు ఓ సింబల్. ఇంధనం, రిటైల్, వినోదం, టెలికం, మాస్ మీడియా, టెక్స్‌టైల్స్ తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ కమ్యూనికేషన్ హెడ్‌గా రోహిత్ బన్సాల్ పాత్ర ఎంతో కీలకమైనది. జియోజెన్‌నెక్ట్స్‌కు రోహిత్ మెంటార్ కూడా. భారత్‌లో ప్రముఖ 100 మంది ప్రజా సంబంధాల నిపుణుల్లో మొదటి ర్యాంక్‌లో నిలుస్తారు’’అని ప్రోవోక్ మీడియా తెలిపింది.


