రూ.750 కోట్లతో ఇన్ఫోసిస్‌ కొత్త క్యాంపస్‌.. ఎక్కడంటే.. | Infosys to Build Massive IT Campus in Noida: A ₹750 Crore Investment | Sakshi
Sakshi News home page

రూ.750 కోట్లతో ఇన్ఫోసిస్‌ కొత్త క్యాంపస్‌.. ఎక్కడంటే..

Nov 17 2025 3:09 PM | Updated on Nov 17 2025 5:10 PM

Infosys building major IT campus with Rs 750 cr

దేశంలో టాప్‌ ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో భారీ ఐటీ క్యాంపస్‌ను నిర్మిస్తోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో తన కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా కంపెనీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ఫోసిస్ నోయిడాలోని సెక్టార్-85లో 27.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోంది.

ఈ క్యాంపస్ నిర్మాణం మొదటి దశ కోసం ఇన్ఫోసిస్ సుమారు రూ.750 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ దశలో సుమారు 2.7 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్యాంపస్ నిర్మాణం ముగిసి, పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత దాదాపు 5,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.

భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ హబ్‌ల్లో ఒకటైన NCRలో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి ఇది కంపెనీకి సహాయపడుతుంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెక్నలాజికల్ ఇన్నోవేషన్‌లకు ఒక కీలకమైన కేంద్రంగా ఈ క్యాంపస్‌ మారుతుందని అధికారులు చెప్పారు. ఈ భవనం LEED ప్లాటినం రేటింగ్‌ (పర్యావరణ అనుకూల భవనాలకు లభించే అత్యున్నత అంతర్జాతీయ ధ్రువీకరణ) లక్ష్యంగా చేసుకుంటుంది. అంటే, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి, ఎనర్జీని సమర్థవంతంగా ఉపయోగించడానికి, ఉద్యోగులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఈ క్యాంపస్ అత్యాధునిక సాంకేతికతతో రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదీ చదవండి: సైనికుల ఆకలి తీర్చే మోనోరైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement