
భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు, ఎక్కడికి వెళ్లినా గోల్డ్ కొనేస్తూ ఉంటారు. ఇంకొందరైతే గోల్డ్ కొనుగోలు చేయడానికి ప్రత్యేకించి.. అరబ్ దేశాలకు వెళ్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నిబంధనల ప్రకారం.. భారతీయ ప్రయాణికుల వద్ద ఎంత విలువైన బంగారం ఉంటే డిక్లేర్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.
భారతీయులు యూఏఈ (UAE)కి ప్రయాణించే సమయంలో తమ వద్ద ఉన్న బంగారం విలువ రూ.13.5 లక్షల(AED 60,000)కు మించి ఉంటే, దానికి డిక్లేర్ (declare) చేయాల్సి ఉంటుంది. అంటే, మీరు వెంట తీసుకెళ్లే బంగారం విలువ.. ఈ పరిమితికి మించి ఉంటే, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి.
పరిమితికి మించి బంగారం తీసుకెళ్లడానికి లీగల్‌గా ఎలాంటి అనుమతి ఉండదు. కాబట్టి దీనికి ట్యాక్స్, డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. వివాహాలు, పండుగలు లేదా గిఫ్ట్ రూపంలో.. సాంప్రదాయకంగా బంగారు ఆభరణాలను తీసుకెళ్లే భారతీయ పర్యాటకులు, NRIలు, వ్యాపార ప్రయాణికులు ఆ విషయాన్ని తప్పకుండా గమనించాలి.
ఇదీ చదవండి: గోల్డ్ వార్నింగ్ సిగ్నెల్: శ్రీధర్ వెంబు ట్వీట్
బంగారం అక్రమ రవాణాను తగ్గించేందుకు, ట్యాక్స్ ఎగవేతను అడ్డుకునేందుకు ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. డిక్లేర్ చేయకుండా ఎక్కువ బంగారం తీసుకెళితే, దానిని సీజ్ చేయవచ్చు. లేదా మీకు భారీ జరిమానా పడవచ్చు లేదా జైలుశిక్షను కూడా అనుభవించాల్సి ఉంటుంది.