breaking news
declare
-
యూఏఈ రూల్: ఎంత బంగారానికి డిక్లేర్ అవసరం..
భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు, ఎక్కడికి వెళ్లినా గోల్డ్ కొనేస్తూ ఉంటారు. ఇంకొందరైతే గోల్డ్ కొనుగోలు చేయడానికి ప్రత్యేకించి.. అరబ్ దేశాలకు వెళ్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నిబంధనల ప్రకారం.. భారతీయ ప్రయాణికుల వద్ద ఎంత విలువైన బంగారం ఉంటే డిక్లేర్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.భారతీయులు యూఏఈ (UAE)కి ప్రయాణించే సమయంలో తమ వద్ద ఉన్న బంగారం విలువ రూ.13.5 లక్షల(AED 60,000)కు మించి ఉంటే, దానికి డిక్లేర్ (declare) చేయాల్సి ఉంటుంది. అంటే, మీరు వెంట తీసుకెళ్లే బంగారం విలువ.. ఈ పరిమితికి మించి ఉంటే, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి.పరిమితికి మించి బంగారం తీసుకెళ్లడానికి లీగల్‌గా ఎలాంటి అనుమతి ఉండదు. కాబట్టి దీనికి ట్యాక్స్, డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. వివాహాలు, పండుగలు లేదా గిఫ్ట్ రూపంలో.. సాంప్రదాయకంగా బంగారు ఆభరణాలను తీసుకెళ్లే భారతీయ పర్యాటకులు, NRIలు, వ్యాపార ప్రయాణికులు ఆ విషయాన్ని తప్పకుండా గమనించాలి.ఇదీ చదవండి: గోల్డ్ వార్నింగ్ సిగ్నెల్: శ్రీధర్ వెంబు ట్వీట్బంగారం అక్రమ రవాణాను తగ్గించేందుకు, ట్యాక్స్ ఎగవేతను అడ్డుకునేందుకు ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. డిక్లేర్ చేయకుండా ఎక్కువ బంగారం తీసుకెళితే, దానిని సీజ్ చేయవచ్చు. లేదా మీకు భారీ జరిమానా పడవచ్చు లేదా జైలుశిక్షను కూడా అనుభవించాల్సి ఉంటుంది. -
Bihar Elections: ఆ ఐదుగురు ఓటరు లిస్టులో చనిపోయి.. బతికే ఉన్నామంటూ..
పట్నా: బీహార్‌లో నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ సందడి నెలకొంది. ఇంతలో చోటుచేసుకున్న ఒక విచిత్ర ఉదంతం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్రంలోని ఒక గ్రామానికి చెందిన ఐదుగురు ఓటర్ల పేర్లు ‘జాబితా’లో చనిపోయినట్లు ప్రకటించారు. అయితే వారంతా బ్లాక్ డెవలప్మెంట్ అధికారి(బీడీవో)ని కలుసుకుని ‘సర్, మేము బతికే ఉన్నాం’ అని పేర్కొంటూ ఒక మెమోరాండం సమర్పించారు.బీహార్ ఎన్నికల మొదటి దశకు కొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉన్న తరుణంలో, బంకా జిల్లాలోని ధోరైయా బ్లాక్‌లోని బట్సర్ గ్రామానికి చెందిన ఐదుగురు ఓటర్లు ముసాయిదా ఓటరు జాబితాలో తమను చనిపోయినట్లు చూపడాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు. వెంటనే వీరంతా బీడీవో అరవింద్ కుమార్‌ను సంప్రదించి, తాము బతికే ఉన్నామంటూ ఒక మెమోరాండం సమర్పించారు. ముసాయిదా ఓటరు జాబితాలో మోహన్ సా, సంజయ్ యాదవ్, రాంరూప్ యాదవ్,నరేంద్ర కుమార్ దాస్, విశ్వవర ప్రసాద్‌ల పేర్లు ఉన్నాయి.సామాజిక కార్యకర్త ఇంద్రదేవ్ మండల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఐదుగురు ఓటర్లు.. జాబితాలోని లోపం కారణంగా ఓటు హక్కును కోల్పోయేవారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా బీడీఓ కుమార్ వీరి ఫిర్యాదుపై స్పందిస్తూ తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హత ఉన్న ఏ ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోరని ఆయన పేర్కొన్నారు. దీనికిముందు చంపారన్‌లోని బాగహి పంచాయతీలోని డుమ్రి గ్రామంలో 15 మంది ఓటర్ల పేర్లు జాబితాలో చనిపోయినట్లు చూపించారు. తరువాత దానిని సరిచేశారు. బీహార్‌లోని మొత్తం 243 నియోజకవర్గాలకు నవంబర్ ఆరు, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. -
'చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించండి'
ఢిల్లీ:ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాని మహారాజ్ మరోసారి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించాలని కోరారు. ఇతర మతాలు, దేశాలు ప్రకటన చేయకముందే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో విక్రమ్ ల్యాండర్ చంద్రున్ని తాకిన చోటును శివ శక్తిగా నామకరణం చేయడంపై ప్రధాని మోదీకి చక్రపాని మహారాజ్ ధన్యవాదాలు తెలిపారు. చంద్రునిపై హిందూ దేశం స్థాపించిన తర్వాత శివ శక్తి పాయింట్‌ను రాజధానిగా మార్చాలని కోరారు. 'చంద్రున్ని హిందూ సనాతన దేశంగా పార్లమెంట్లో ప్రకటించాలి. చంద్రయాన్ 3 జాబిల్లిని తాకిన చోటును రాజధానిగా నిర్మించాలి. అప్పుడు జిహాదీ స్వభావం ఉన్న ఉగ్రవాదులు అక్కడకు రాకుండా ఉంటారు.' అని స్వామి చక్రపాని మహారాజ్ అన్నారు. గతంలోనూ ఇలాంటి వివాదాంశాల్లో స్వామి చక్రపాని మహారాజ్ చిక్కుకున్నారు. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు గోమాంసం తినేవారికి ఎలాంటి సహాయం అందకూడదని అన్నారు. కాగా.. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని చేరడంతో చంద్రయాన్ 3 విజయం సాధించింది. దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. విక్రమ్ ల్యాండర్ చంద్రున్ని తాకిన చోటుని ప్రధాని మోదీ శివ శక్తి పాయింట్‌గా పేరు పెట్టారు. ఇదీ చదవండి: చంద్రుడిపై ఉష్ణోగ్రతల్లో వేగంగా మార్పులు -
ఇంటర్ ఫలితాల వెల్లడి
-
ఇంటర్ ఫలితాల వెల్లడి
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ మొదటి, రెండో సంవత్సరం జనరల్, వొకేషనల్ కోర్సుల ఫలితాలు వెలువడ్డాయి. ఆదివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 57 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్ ఫలితాల్లో 66.4 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ కాలేజీల ఫలితాలు మెరుగయ్యాయని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఫస్టియర్‌లో పరీక్షకు 4,75,874 మంది విద్యార్థులు హాజరుకాగా.. 2,70,738 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ పరీక్షకు 4,18,213 మంది విద్యార్థులు హాజరుకాగా.. 2,75,273 మంది ఉత్తీర్ణలయ్యారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఉత్తీర్ణులైన వారిలో ఇంటర్ ఫస్టియర్‌లో 50 శాతం మంది విద్యార్థులు 'ఏ' గ్రేడ్ సాధించగా.. సెకండియర్‌లో 53 శాతం మంది విద్యార్థులకు 'ఏ' గ్రేడ్ వచ్చిందన్నారు. ఇక జిల్లాల వారిగా పరిశీలిస్తే.. ఇంటర్ ఫస్టియర్‌లో టాప్‌లో మేడ్చల్ జిల్లా నిలవగా.. రెండో స్థానంలో రంగారెడ్డి నిలిచింది. చివరిస్థానంలో మహబూబాబాద్ నిలిచింది. ఇంటర్ సెకండియర్‌లోనూ మేడ్చల్ జిల్లా టాప్‌లో నిలవగా.. రెండో స్థానంలో రంగారెడ్డి, చివరిస్థానంలో నిర్మల్, గద్వాల్, మహబూబాబాద్‌లు నిలిచాయని కడియం శ్రీహరి తెలిపారు. మే 15 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. -
లీకేజీ నిజమే..!