breaking news
Caparo Industries
-
లార్డ్ స్వరాజ్‌పాల్ కన్నుమూత
లండన్/న్యూఢిల్లీ: ప్రముఖ ప్రవాస భారతీయ పారిశ్రామిక దిగ్గజం లార్డ్ స్వరాజ్ పాల్ (94) లండన్‌లో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఇటీవల ఆయన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. స్వరాజ్‌పాల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పరిశ్రమ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పాటుపడిన దానశీలిగా ఆయన్ను అభివరి్ణంచారు. బ్రిటన్–భారత్ సంబంధాలను బలోపేతం చేసేందుకు స్వరాజ్ పాల్ ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. వ్యాపార దిగ్గజం, దానశీలి, అంతర్జాతీయంగా ప్రవాస భారతీయులకు ఆయనొక ఐకాన్ అని తెలిపారు. 1966లో కుమార్తె చికిత్స కోసం బ్రిటన్ వెళ్లిన లార్డ్ పాల్ ఆ తర్వాత అక్కడే అంతర్జాతీయ సంస్థ కపారో గ్రూప్‌ను నెలకొల్పారు. ఉక్కు, ఇంజినీరింగ్, ప్రాపర్టీ తదితర రంగాల్లో దిగ్గజంగా తీర్చిదిద్దారు. బ్రిటన్‌లో అత్యంత సంపన్న ఏషియన్‌గా ఎదిగారు. దశాబ్దాల పాటు వ్యాపార, రాజకీయ రంగాల్లో కీలకంగా నిల్చారు. -
స్వరాజ్‌పాల్‌కు జీవిత సాఫల్య పురస్కారం
లండన్: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్‌పాల్‌కు ఏషియన్ బిజినెస్ అసోసియేషన్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. పరిశ్రమలు, విద్య తదితర రంగాలకు పాల్ చేసిన సేవలకుగాను ఈ పురస్కారం లభించింది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో స్వరాజ్‌పాల్ తరఫున ఆయన కుమార్తె అంజలి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పాల్ పంపిన సందేశాన్ని ఆమె చదివి వినిపించారు.