క్షమించండి | Priyanka Chopra apologies for 'Hindu terror' plot in American TV | Sakshi
Sakshi News home page

క్షమించండి

Jun 11 2018 12:29 AM | Updated on Aug 20 2018 2:50 PM

Priyanka Chopra apologies for 'Hindu terror' plot in American TV - Sakshi

ప్రియాంకా చోప్రా

అమెరికన్‌ ‘క్వాంటికో’ సిరీస్‌లో పాల్గొన్న తర్వాత ప్రియాంకా చోప్రా ఇంటర్నేషనల్‌ స్టార్‌డమ్‌ మరింత పెరిగింది. కానీ క్వాంటికో థర్డ్‌ సీజన్‌ ప్రియాంకకు అంతగా కలిసి రానట్లు ఉంది. ఆల్రెడీ ఈ షోకు ప్రేక్షకాదరణ ఆశించిన స్థాయిలో లేకపోగా, ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఈ సిరీస్‌లో వచ్చిన ‘బ్లడ్‌ ఆఫ్‌ రోమియో’ ఎపిసోడ్‌లో భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రియాంకా చోప్రా నటించారన్నది అభియోగం. ఈ వివాదంపై ఆమె స్పందించి క్షమాపణలు చెప్పారు.

‘‘క్వాంటికో సిరీస్‌ రీసెంట్‌ ఎపిసోడ్‌లో నా యాక్టింగ్‌ కొందరి మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నట్లయితే నన్ను క్షమించండి. అది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. నేను ఇండియన్‌ అయినందుకు గర్వపడుతున్నాను. ఇందులో ఎప్పటికీ ఏ మార్పు ఉండదు’’ అని పేర్కొన్నారు ప్రియాంకా చోప్రా. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రియాంకా తండ్రి అశోక్‌ చోప్రా చనిపోయి ఐదేళ్లు గడిచిపోయాయి. ఈ సందర్భంగా తండ్రితో గడిపిన మధుర క్షణాలను ఓ వీడియో రూపంలో ప్రియాంకా చోప్రా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement