మా వాళ్లదే తప్పు.. క్షమించండి | Bangladesh Board Apology for Events During Sri Lanka Match | Sakshi
Sakshi News home page

Mar 18 2018 11:37 AM | Updated on Mar 18 2018 3:28 PM

Bangladesh Board Apology for Events During Sri Lanka Match - Sakshi

ఢాకా : నిదహాస్‌ ట్రోఫీలో భాగంగా శుక్రవారం శ్రీలంక, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ అనంతరం నెలకొన్న తీవ్ర పరిణామాలపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బీసీబీ) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమ దేశ ఆటగాళ్లే తప్పు చేశారంటూ క్షమాపణలు తెలియజేసింది.

ఈ మేరకు బీసీబీ.. శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు ఓ లేఖ రాసింది. ‘మా ఆటగాళ్ల వ్యవహార శైలి మూలంగానే విధ్వంసకాండ జరిగింది. ఇతరులను రెచ్చగొట్టే విధంగా మైదానంలో ఆటగాళ్లు అలా ప్రవర్తించడాన్ని ఎవరూ సమర్థించబోరు. తప్పంతా మా వాళ్లదే. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా మా ఆటగాళ్లు వ్యవహరించారు. అందుకు బీసీబీ క్షమాపణలు తెలియజేస్తోంది’ అంటూ బీసీబీ పేర్కొంది.  

కాగా, మ్యాచ్‌ చివరి ఓవర్లో  రెండు బంతులు భుజం కంటే ఎత్తులో వెళ్లినా అంపైర్లు నోబాల్‌ ఇవ్వకపోవడంతో బంగ్లా బ్యాట్స్‌మన్‌ అసహనానికి గురయ్యారు. బంగ్లా సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్లు.. శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగారు. చివరికి బంగ్లా జట్టు మేనేజర్‌ ఖాలెద్‌ మెహమూద్‌ చొరవతో ఆటగాళ్లు బ్యాటింగ్‌ కొనసాగించారు. ఒక్క బంతి తేడాతో  మ్యాచ్‌ గెలిచాక లంక ఆటగాళ్లను, ప్రేక్షకులను రెచ్చగొట్టేరీతిలో బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేయగా.. అందుకు ప్రతిగా మ్యాచ్‌ పూర్తైన తర్వాత బంగ్లా డ్రెస్సింగ్‌ రూమ్‌ అద్దాలు ధ్వంసమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement