
టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పుత్రికోత్సాహంతో పొంగిపోయాడు.

తన కుమార్తె సారా పైలైట్స్ స్టూడియో ఆరంభించడం తమకు గర్వకారణమన్నాడు.

జీవితంలో పోషకాహారం, వ్యాయామం అతిముఖ్యమైనవని.. ఈ రెండింటిలోనూ సారా తనదైన శైలిలో ముందుకు సాగడం ఆనందాన్నిస్తోందని సంతోషం వ్యక్తం చేశాడు.

కాగా సారా మోడల్, న్యూట్రీషనిస్ట్‌గా రాణిస్తోంది. తాజాగా పైలైట్స్ స్టూడియో (వెల్‌నెస్ సెంటర్)ను ముంబైలోని అంధేరిలో ప్రారంభించింది.

స్టూడియో ప్రారంభోత్సవంలో తల్లిదండ్రులు సచిన్- అంజలితో పాటు తన తమ్ముడు అర్జున్ టెండుల్కర్‌కు కాబోయే భార్య సానియా చందోక్‌తో కలిసి సారా రిబ్బన్ కట్ చేసింది.