Dinesh Karthik: అభ్యంతరకర వ్యాఖ్యలపై దినేశ్ కార్తీక్ క్షమాపణలు

టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన సెక్సియెస్ట్ కామెంట్లపై క్షమాపణలు చెప్పాడు. లంక, ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే సందర్భంగా.. కామెంటేటర్‌గా వ్యవహరించిన దినేశ్ చేసిన ‘బ్యాట్‌లు- పక్కవాళ్ల భార్య’ కామెంట్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.
‘జరిగిందానికి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. తప్పుడు ఉద్దేశంతో నేను ఆ కామెంట్లు చేయలేదు. కావాలని చేసిన కామెంట్లు ఎంతమాత్రం కావు. కానీ, తప్పు జరిగిపోయింది. అలా మాట్లాడాల్సి ఉండకూడదు. ఈ విషయంపై నా తల్లి, భార్య కూడా నన్ను తిట్టారు. సారీ.. ఇంకోసారి తప్పు జరగదు’ అంటూ ఆదివారం ఒక సందేశం విడుదల చేశాడు దినేశ్ కార్తీక్.
కాగా, 36 ఏళ్ల ఈ బ్యాట్స్‌మన్ కమ్ వికెటకీపర్ భారత్ తరపున 94 వన్డేలు, 32 టీ20లు, 26 టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కామెంటేటర్‌గా మారిన దినేశ్.. అందులోనూ అదరగొడుతుండడం విశేషం. ‘ప్లేయర్స్ తమ బ్యాట్స్ కంటే అవతలి వాళ్ల బ్యాట్స్‌ను ఎక్కువగా ఇష్టపడతారని, అవి పక్కవాళ్ల భార్యల్లాంటివేనని. ఆకర్షణనీయంగా ఉంటాయని, అందుకే ఆకర్షితులు అవుతార’ని కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు దినేశ్ కార్తీక్.
@DineshKarthik take a bow👏🏻👏🏻 Brilliant commentary 😂😂 I can imagine @felixwhite and @gregjames applauding right now #tailendersoftheworlduniteandtakeover pic.twitter.com/SLD4kxIB2n
— Jon Moss (@Jon_Moss_) July 1, 2021
మరిన్ని వార్తలు