Kalpika Ganesh Fires On Abhinav Gomatam, Demands Apology - Sakshi
Sakshi News home page

Kalpika Ganesh-Abhinav Gomatam : అభినవ్‌పై చర్యలు తీసుకోవాలంటూ నటి కల్పిక డిమాండ్‌

Oct 27 2022 1:49 PM | Updated on Oct 27 2022 3:29 PM

Kalpika Ganesh Fires On Abhinav Gomatam Demands Apology - Sakshi

నటి కల్పికా గణేష్‌ గుర్తుందా? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు చిత్రంలో సమంతకు అక్కగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తుంది. అయితే కొద్దిరోజులుగా కల్పికా గణేష్‌ పేరు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. నటుడు అభినవ్‌ గోమటంతో కల్పికా సోషల్‌ వార్‌కు దిగింది.

ఇంతకీ ఏమైందంటే.. ఇటీవలె ఓ షోలో కల్పికకు బెస్ట్‌ సపోర్టింగ్‌ రోల్‌ కింద అవార్డు వరించిందట. దీనిపై అభినవ్‌ చాలా వ్యంగ్యంగా మాట్లాడాడట. ఇప్పుడు ఈ అంశమే వీరిద్దరి మధ్య మాటల యుద్ధాన్ని రాజేస్తుంది. తన పనిని అభినవ్‌ అమానించాడని పేర్కొంటూ అతడు తనకు క్షమాపణలు చెప్పాలంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తుంది.

అంతేకాకుండా అభినవ్‌ గోమటం ఫ్రెండ్స్‌ని కూడా ట్యాగ్‌ చేస్తూ అతడితో సారీ చెప్పించాలంటూ సవాలు చేస్తుంది. అటు అభినవ్‌ కూడా .. కల్పికాకు క్షమాపణలు చెప్పేది లేదని, ఆమె కావాలనే తనను టార్గెట్‌ చేస్తుందంటూ ఫైర్‌ అయ్యాడు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ని కూడా కల్పికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

సోషల్‌ మీడియాలో ఇలా మహిళలను తక్కువ చేసేలా మాట్లాడటమే కాకుండా గౌరవం ఇవ్వని ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ కల్పికా డిమాండ్‌ చేస్తుంది. కాగా  అభినవ్‌ గోమటం ఈ నగరానికి ఏమైంది, శ్యామ్‌సింగరాయ్‌ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement