breaking news
Kalpika Ganesh
-
తెలుగు నటి కల్పికపై మరో కేసు
కొన్నిరోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ క్లబ్లో నటి కల్పిక నానా హంగామా చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈమెపై మరో కేసు నమోదైంది. ఇన్ స్టాలో తనని అసభ్య పదజాలంతో దూషించిందని కీర్తన అనే యువతి.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించింది. ఆన్ లైన్ వేదికగా తనని వేధిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలని కూడా కీర్తన.. పోలీసులకు అందించారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'టూరిస్ట్ ఫ్యామిలీ' దర్శకుడితో నాని.. పోస్ట్ వైరల్)కల్పిక గతంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'పడిపడి లేచే మనసు' తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది. కానీ గత రెండు మూడేళ్ల నుంచి ఈమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం ఓ క్లబ్లో తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్లి రచ్చ చేసింది. అదికాస్త పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేశారు.అయితే కల్పిక వ్యవహారం చూస్తుంటే ఈమె ఏమైనా బిగ్‌బాస్ షోలో అడుగుపెడుతుందా అనే అనుమానం వస్తోంది. ఎందుకంటే గతేడాది కూడా ఇలానే ఆర్జే శేఖర్ బాషా.. రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారంలో ఉన్నాడు. అలా ఇతడిపై పోలీసులు కేసు కూడా పెట్టారు. ఇది జరిగిన కొన్నిరోజులకే బిగ్‌బాస్ హౌసులో అడుగుపెట్టాడు. మరి కల్పిక కూడా ఇలా ఏమైనా చేస్తుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: హైదరాబాద్ జట్టు ఓనర్‌తో అనిరుధ్ పెళ్లి?) -
పబ్‌లో అల్లరి... నటిపై కేసు.. అనుకున్నదే జరిగిందిగా!
గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అనేది ఒకప్పుడు అవివేకంతో జరిగేది.. ఇప్పుడు అతి తెలివితో జరుగుతోంది. ఆ అతి తెలివి ఎలాంటిది అంటే... వైరంతోనే వైరల్ అవుతామనే అపోహ కల్పిస్తుంది. అందుకే ఇటీవలి కాలంలో అనవసర వివాదాలతో అవాంఛనీయ ప్రచారాన్ని తెచ్చుకుంటున్న సెలబ్రిటీలు ఎందరో కనిపిస్తున్నారు. అలాంటి వారిని చూసినప్పుడు చుట్టాలున్నారు జాగ్రత్త అనేది సినిమా తీశారు గానీ చట్టాలున్నాయి జాగ్రత్త అనే సినిమా కూడా ఎవరైనా తీసి వీళ్లకి చూపించి ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది.ట్రెండింగ్‌లో కల్పికఅది అలా ఉంచితే... సినీ నటి కల్పిక (Kalpika Ganesh) అనగానే ఒకప్పుడు అయితే ఎవరామె? అని అడిగినవాళ్లే ఎక్కువ. అయితే ఇప్పుడు మాత్రం ఓహో ఆ అమ్మాయా? పబ్‌లో గొడవపడింది ఆమెనా? అని వెంటనే గుర్తుపడుతున్నారు. మరి ఇలాంటి ప్రచారం ఆమె కెరీర్‌కు ఎంతవరకూ ఉపకరిస్తుందో ఆమెకే తెలియాలి కానీ.. ఆమె వ్యక్తిగత జీవితానికి ఏ మాత్రం ఉపకరించదని పోలీసులు తమ చర్యల ద్వారా తేల్చి చెప్పారు.చిలికి చిలికి గాలివానలా..హైదరాబాద్ నగరంలో ప్రిజమ్ పబ్ అంటే తెలియని పార్టీ ప్రియులు ఉండరు. ఓ రకంగా చెప్పాలంటే వందకు పైగా పబ్స్ ఉన్న సిటీలో టాప్ 5 ప్లేస్‌లో ఉంటుంది. అలాంటి చోటకి వెళ్లి తాను సెలబ్రిటీని కాబట్టి బర్త్‌డే కేక్ తనకు కాంప్లిమెంట్రీ ఇవ్వాలని అడగడం, దానికి తాము ఒప్పుకోకపోవడంతో కల్పిక గొడవ సృష్టించారని పబ్ సిబ్బంది ఆరోపణ... ఆ గొడవ చిలికి చిలికి గాలివానలాగా మారింది అనడం కన్నా కల్పిక తన ఇంటర్వ్యూల ద్వారా సోషల్ వేదికలపై హల్ చల్ ద్వారా మరింత రచ్చ చేసింది అనడం సబబుగా ఉండొచ్చు.కల్పికపై కేసుఆ వివాదం ద్వారా ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసింది కల్పిక. దాదాపుగా ఓ వారం రోజుల పాటు ఆ వివాదం సజీవంగా ఉండేలా తన వంతు సఫలయత్నం చేసిందామె. ఏమైతేనేం.. జనం కొత్త వివాదాల అన్వేషణలో తలమునకలవడంతో ప్రస్తుతం కల్పిక వ్యవహారం కాస్త సద్దుమణిగింది. అయితే పబ్‌లో గొడవను సామరస్యంగా పరిష్కరిద్దామని తాము చూస్తే ఆ సందర్భంగా కల్పిక తమపై వీరంగం చేసిందనే అభిప్రాయంతో ఉన్న పోలీసులు మాత్రం విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేదు. పకడ్బందీగా కేసు తయారు చేసి కల్పికను బుక్ చేసేశారు. గత నెలాఖరులో ప్రిజం పబ్‌లో అల్లర్లు సృష్టించిందనే ఆరోపణలతో నటి కల్పిక గణేష్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.పోలీసుల ఎదుటే రెచ్చిపోయిన బ్యూటీపబ్లో గొడవ జరుగుతుందనే సమాచారం మేరకు తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని అయితే తమ సమక్షంలోనే నటి పబ్ సిబ్బందిని దుర్భాషలాడిందని కేసు పెట్టారు. అంతేకాక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడానికి కోర్టు నుంచి పోలీసులు అనుమతి కోరారు. అనంతరం గురువారం కోర్టు అనుమతి పొందిన తర్వాత పోలీసులు ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో.. విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలని కల్పికకు పోలీసులు రేపో మాపో నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని కల్పిక ఇకపై ఎలా ముగించబోతోంది అనేది వేచి చూడాల్సి ఉంది.చదవండి: బొమ్మలా నిల్చున్న జైనబ్.. తమన్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? -
సినీనటి కల్పికపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు
-
నటి కల్పికపై కేసు నమోదు
టాలీవుడ్ నటి కల్పికా గణేశ్‌పై 324(4),352,351(2) బిఎన్ఎస్ ఆక్ట్ ప్రకారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29న ప్రిజం పబ్‌లో బిల్ చెల్లించకుండా తమ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని కల్పికపై ఫిర్యాదు చేశారు. బర్త్ డే కేక్ విషయమై ప్రిజం పబ్ నిర్వాహకులకు, ఆమెకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో పబ్ నిర్వాహకులు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో కల్పికపై వారు కేసు నమోదు చేశారు. తమపై ప్లేట్లు విసిరేయడంతో పాటు బాడీ షేమింగ్ కూడా కల్పిక చేశారని ప్రిజం సిబ్బంది తెలిపారు. ఇప్పటికే పబ్ యాజమాన్యంపై కల్పిక కూడా కేసు పెట్టిన విషయం తెలిసిందే.గొడవకు సంబంధించిన పలు వీడియోలను నటి కల్పిక కూడా తన సోషల్‌మీడియాలో పంచుకుంది. ప్రిజం పబ్ సిబ్బంది తనపై బూతులతో రెచ్చిపోయారని ఆవేదన చెందింది. తనను డ్రగ్ అడిక్ట్ అంటూ దాడి కూడా చేసినట్లు ఆమె పేర్కొంది. గొడవ విషయమై పబ్ యాజమాన్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అలానే ప్రవర్తించాలని కల్పిక ఆరోపించింది. ప్రస్తుతం ఇరువురి ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.'ఆరెంజ్' మూవీలో జెనీలియా ఫ్రెండ్‌గా నటించిన కల్పిక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాలు చేసింది. -
మా పేరేంట్స్‌కు కూడా తెలుసు: టాలీవుడ్ నటి
టాలీవుడ్ నటి కల్పికా గణేశ్ ఇటీవల వార్తల్లో నిలిచింది. తన బర్త్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. కానీ అదే సమయంలో పబ్ సిబ్బందితో గొడవ జరిగింది. బర్త్ డే కేక్ విషయమై పబ్ నిర్వహకులకు, ఆమెకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను నటి కల్పిక తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. తనపై పబ్ నిర్వహకులు దురుసుగా ప్రవర్తించారని కల్పిక చెప్పింది. అయితే ఆ తర్వాత ఆమె పబ్లిసిటీ కోసమే ఇదంతా చేశారని వార్తలొచ్చాయి.తాజాగా ఈ అంశంపై నటి కల్పికా గణేశ్ స్పందించింది. తానేలాంటి పబ్లిసిటీ స్టంట్ చేయలేదని తెలిపింది. బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే మీరు ఇలా చేశారని కొందరు అంటున్నారని ప్రశ్నించగా.. వాళ్లే నన్ను చూడాలనుకుంటున్నారేమో అని సమాధానమిచ్చింది. బర్త్ డే పార్టీలో తాను మందు తాగలేదని వెల్లడించింది. తనకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందని.. ఈ విషయం నా ఫ్రెండ్స్‌కు, తల్లిదండ్రులకు కూడా తెలుసని పేర్కొంది. గతంలో తాను ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫంక్షన్లలో ఆల్కహాల్ తీసుకునేదాన్ని తెలిపింది. ప్రస్తుతానికి మందుతాగి దాదాపు రెండు, మూడేళ్లయిందని.. ఆ రోజు కేవలం వార్మ్వాటర్ మాత్రమే తీసుకున్నట్లు కల్పికా గణేశ్ అంటోంది. మరోవైపు కల్పికా కావాలనే ఇదంతా చేసిందని.. కేవలం ఫేమ్ కోసమేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: హైదరాబాద్ పబ్‌లో తెలుగు నటి హంగామా.. వీడియో వైరల్)కాగా.. రామ్ చరణ్ 'ఆరెంజ్' మూవీలో జెనీలియా ఫ్రెండ్‌గా నటించిన కల్పిక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఈమెకు పెద్దగా ఆఫర్స్ లేవు. ఇలాంటి ఈ టైంలో వివాదం ద్వారా వార్తల్లో నిలిచింది. -
హైదరాబాద్ పబ్‌లో తెలుగు నటి హంగామా.. వీడియో వైరల్
తెలుగులో పలు చిత్రాల్లో నటించిన కల్పిక గణేశ్.. తాజాగా ఓ వివాదంలో నిలిచింది. రీసెంట్గా తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్‌కి వెళ్లింది. బర్త్ డే కేక్ విషయమై పబ్ నిర్వహకులు, ఈమెకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోని నటి కల్పిక తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. తనపై పబ్ నిర్వహకులు దురుసుగా ప్రవర్తించారని కల్పిక చెబుతోంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)అయితే గొడవ విషయమై పబ్ యాజమాన్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అలానే ప్రవర్తించాలని కల్పిక ఆరోపిస్తోంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వివాదంలో నటిపై పబ్ సిబ్బంది దాడి చేశారని అంటున్నారు గానీ అందుకు తగ్గ ఫొటోలు, వీడియోలు ఏం బయటకు రాలేదు. దీంతో దాడి నిజంగా జరిగిందా లేదా అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.'ఆరెంజ్' మూవీలో జెనీలియా ఫ్రెండ్‌గా నటించిన కల్పిక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఈమెకు పెద్దగా ఆఫర్స్ లేవు. ఇలాంటి ఈ టైంలో వివాదం ద్వారా వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: నాగార్జున కొడుకు పెళ్లి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం) View this post on Instagram A post shared by iamkalpika (@iamkalpika27) -
కల్పికతో ఎఫైర్ లేదు.. ఆమె చేసిన రచ్చకు కారణం ఇదే: అభినవ్ గోమటం
నటి కల్పికా గణేష్ గుర్తుందా? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు చిత్రంలో సమంతకు అక్కగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఏడాది క్రితం నటుడు అభినవ్ గోమటంపై ఆమె ఎన్నో ఆరపణలు చేసింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య సోషల్ వార్ నడిచింది. అభినవ్ తనను వేధించాడని, తన పట్ల అసభ్యకరంగా మాట్లాడాడని అప్పట్లో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ గొడవలో చివరకు పోలీసులు కూడా ఎంట్రీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కల్పికా గణేష్ గురించి అభినవ్ గోమటం పలు వ్యాఖ్యలు చేశాడు. కల్పిక తనకు కేవలం ఫ్రెండ్ మాత్రమేనని.. ఆమెతో ఎలాంటి ఎఫైర్ లేదని అభినవ్ స్పష్టం చేశాడు. ఆమెతో పెద్దగా పరిచయం కూడా లేదని ఆయన ఇలా చెప్పాడు. 'మేమిద్దరం అప్పుడప్పుడు చాట్ చేసేవాళ్లం. అది కూడా ఎప్పుడో ఓ ఆరు నెలలకు ఒకసారి. అయితే, గతేడాది నవంబర్‌లో ఒక సంఘటన జరిగింది. ఆమెకు నారీ శక్తి అవార్డు వచ్చిందని నాకు మెసేజ్ చేసింది. ఆ అవార్డు గురించి నేను ఎప్పుడూ వినలేదు.. కానీ నీకు రావడం చాలా గొప్ప విషయం అంటూ అభినందనలు అని రిప్లై ఇచ్చాను. ఇక అప్పటి నుంచి గొడవ స్టార్ట్ చేసింది. అవార్డు గురించి కూడా వినలేదు అంటావా..? నీకు అంత చులకనా? నీకు అంత ఇగోనా? అంటూ పెద్ద అగ్లీ ఫైట్ చేసింది. ఆ సమయంలో నేనొక ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నానని అనుకున్నాను. ఆమె నన్ను పురుషాహంకారి అదీ ఇదీ అంటూ మెసేజ్‌లు చేస్తోంది. దీంతో నేను రిప్లై ఇవ్వడం ఆపేశాను. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే ఆమె ప్రతి ఒక్కరితోనూ గొడవే. అందరినీ ఇన్‌స్టాగ్రామ్‌లో తిట్టుకుంటోంది. ఆ అవార్డు గురించి నాకు తెలియదు అన్న పాపానికి... ఆ చాట్ మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. అందులో తప్పేముందని చాలామంది నెటిజన్లు ఆమెను తప్పుపట్టారు. అవార్డు గురించి తెలియదని చెప్పినందుకు నేను చచ్చిపోవాలని కూడా ఆమె మెసేజ్‌లు పెట్టింది. అప్పుడు జరిగిన విషయం ఇదే.. అంతే కానీ ఆమెతో ఎలాంటి లవ్వూ లేదు.. గివ్వూ లేదు. నేను ఎలాంటి ప్రేమ కావ్యాలు కూడా రాయలేదు. అని అభినవ్ చెప్పాడు. గతంలో కల్పిక చిత్రపరిశ్రమలోని చాలామంది నటీనటులపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి ట్రెండింగ్‌లో నిలిచిన విషయం తెలిసిందే. -
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' బ్యూటీ కల్పిక గణేష్ (ఫోటోలు)
-
హీరోయిన్ సీక్రెట్ పెళ్లిపై నటి కల్పిక గణేశ్ సంచలన వ్యాఖ్యలు
-
డైరెక్టర్‌తో హీరోయిన్ సీక్రెట్ పెళ్లి.. యూటర్న్ తీసుకున్న కల్పికా గణేశ్
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, నేను శైలజ, యశోద, హిట్ వంటి చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న కల్పిక గణేశ్ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. సెలబ్రిటీలపై నిత్యం ఆరోపణలు గుప్పించే ఆమె ఆమధ్య హీరోయిన్ ధన్య బాలకృష్ణపైతో మాటల యుద్ధమే చేసింది. ధన్య.. పెళ్లై విడాకులు తీసుకున్న డైరెక్టర్‌ను సీక్రెట్‌గా పెళ్లాడిందని, అతడు మరెవరో కాదు, మారి డైరెక్టర్ బాలాజీ మోహన్ అంటూ గతేడాది డిసెంబర్లో ఓ వీడియో రిలీజ్ చేసింది కల్పిక. ఊహించని ట్విస్ట్ దీనిపై పెద్ద దుమారమే చెలరేగగా గతేడాది చివర్లో అదే నిజమని అంగీకరించాడు బాలాజీ మోహన్. అయితే తమ పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించిందంటూ కల్పికపై కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. ఈ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కల్పికా గణేశ్.. సదరు సెలబ్రిటీ జంటకు క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. 'ధన్య బాలకృష్ణ, బాలాజీ మోహన్.. మీపై తప్పుడు ఆరోపణలు చేసి మీ పరువుకు భంగం కలిగించినందుకు క్షమాపణలు చెప్తున్నాను. తప్పుడు ఆరోపణలు.. క్షమాపణలు నేను మీపై చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదు. మనస్ఫూర్తిగా మీకు, మీ కుటుంబానికి, అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఇక మీదట ధన్య, బాలాజీల గురించి ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడను' అని చెప్పుకొచ్చింది. అటు బాలాజీ మోహన్ కూడా మద్రాస్ హైకోర్టులో తన పిటిషన్‌ను వెనక్కు తీసుకున్నాడు. అయితే అంతకంటే ముందే న్యాయస్థానం కల్పికా క్షమాపణలు చెప్పిన వీడియోను సోషల్ మీడియాలో అలాగే ఉంచాలని ఆదేశించింది. ధన్య బాలకృష్ణ మారి డైరెక్టర్కిది రెండో పెళ్లి బాలాజీ మోహన్, ధన్య బాలకృష్ణ 2020 జనవరి నెలలోనే వివాహం చేసుకున్నారు. బాలాజీ మోహన్‌కిది రెండో పెళ్లి. అతను ఇదివరకే తన చిన్ననాటి స్నేహితురాలు అరుణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ‘మారి’, ‘మారి 2’, ‘వాయై మూడి పేసవుం’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు బాలాజీ. ధన్య బాలకృష్ణ ప్రధానంగా తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలలో పని చేస్తోంది. తెలుగులో ఆమె 'సాఫ్ట్వేర్ సుధీర్', 'కార్బన్', 'రాజు గారి గది' వంటి చిత్రాల్లో నటించింది. చదవండి: హీరోయిన్‌కు దోశలు వేసిన సోనూసూద్.. ఆ హీరో ఫ్యాన్స్‌కు నచ్చలే! -
డైరెక్టర్‌తో ధన్య బాలకృష్ణ సీక్రెట్ పెళ్లి.. అవును ఇది నిజమే..!
ప్రముఖ నటి, హీరోయిన్ ధన్య బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 7th సెన్స్, నేను శైలజ, జయ జానకి నాయక వంటి చిత్రాలల్లో నటిగా అలరించిన ఆమె ఈ మధ్య వెబ్ సిరీస్‌లో సైతం నటించింది. అల్లుడు గారు, లూసర్, రెక్కీ వంటి వెబ్ సిరీస్‌లో ఆమె హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే ఆమె ఓ పెళ్లై, విడాకులు తీసుకున్న ఓ డైరెక్టర్‌ను వివాహం చేసుకుందంటూ షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ విషయాన్ని మరో నటి కల్పిక గణేశ్ తన యూట్యూబ్ చానల్లో ధన్య గురించి ఈ విషయం చెబుతూ గతంలో ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: పెళ్లయిన డైరెక్టర్‌ను ధన్య బాలకృష్ణ సీక్రెట్ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు) తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు బాలాజీ మోహన్ ధ్రువీకరించారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు కోర్టుకు తెలిపారు. కల్పిక గణేశ్ తనపై, తన భార్య ధన్య బాలకృష్ణపై పరువు నష్టం కలిగించేలా యూట్యూబ్‌లో వీడియో విడుదల చేసిందని కోర్టుకు సమర్పించారు. తన వ్యక్తిగత పరువుకు భంగం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని దర్శకుడు ఆరోపించాడు. అయితే బాలాజీ మోహన్, నటి ధన్య బాలకృష్ణ జనవరి 2020 నెలలోనే వివాహం చేసుకున్నారు. బాలాజీ మోహన్‌కిది రెండో వివాహం. అతను ఇదివరకే అరుణను వివాహం చేసుకున్నారు. ‘మారి’, ‘మారి 2’, ‘వాయై మూడి పేసవుం’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ధన్య బాలకృష్ణ ప్రధానంగా తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలలో పని చేస్తోంది. ఆమె 'సాఫ్ట్వేర్ సుధీర్', 'కార్బన్', 'రాజు గారి గది' వంటి చిత్రాలలో నటించింది. -
ఆ సెలబ్రిటీల బండారం బయటపెడతా: నటి వార్నింగ్
యశోద సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించి ఇటీవలే తెలుగు ప్రేక్షకులను పలకరించింది కల్పిక గణేశ్. తరచూ వివాదాలతోనే సావాసం చేస్తున్న ఆమె ఇటీవల ఓ అవార్డుల ఫంక్షన్‌కు పిలవకపోయినా వెళ్లింది! ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా స్టేజీ ఎక్కి మరీ చెప్పింది. నన్నెవరూ ఈ ఫంక్షన్‌కు ఆహ్వానించలేదని, అయినా సరే వచ్చేశానంటూ మైక్ తీసుకుని మాట్లాడింది. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'నన్నెవరూ పిలవలేదు. కానీ ఇండస్ట్రీని నా ఇల్లుగా భావిస్తాను. అందుకే పిలవకపోయినా ఏ మొహమాటం లేకుండా వచ్చేశాను. ట్రోల్స్ అంటారా? వాళ్లు చేస్తూనే ఉంటారు. జనాలకు నిజాలేంటో తెలియాలనే చాలామంది నిజస్వరూపాలను బయటపెడుతున్నాను. ధనుష్, ధన్య బాలకృష్ణ, అనిరుధ్, బాలాజీ మోహన్.. ఇలా కొందరి గురించి అసలు నిజాలు బయటకు రావాలి. సుచీలీక్స్ ఊరికే బయటకు రాలేదు. చిన్మయి కూడా ఎంతో ఫైట్ చేసింది కానీ ఆమెను క్లోజ్ చేశారు. ఈ కొత్త సంవత్సరంలో ఇంకా చాలామంది బండారాలు బయటపెడతా' అని చెప్పుకొచ్చింది కల్పికా గణేశ్. చదవండి: సెట్స్‌లో 20 ఏళ్ల నటి ఆత్మహత్య తండ్రి సంవత్సరీకం.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ -
నా పవర్ ఏంటో చూపిస్తా.. నటి కల్పిక షాకింగ్ కామెంట్స్..!
నటి ధన్య బాలకృష్ణ, మరో నటి కల్పిక గణేశ్ మధ్య తాజాగా ఓ వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే షాకింగ్ ఆరోపణలు చేశారు మరో నటి కల్పికా గణేశ్. కల్పికా గణేశ్ మాట్లాడుతూ.. ' నువ్వు నన్ను వివాదంలోకి లాగుతున్నావు. సరే అయితే కోర్టులో కలుసుకుందాం. నీ విషయాలు బయటపెట్టే సరికి ఇన్నాళ్లు నన్ను బ్లాక్ చేసిన నువ్వు.. రాత్రి అన్‌బ్లాక్ చేసి వరుసగా కాల్స్ చేశావు. అంటే నువ్వు భయపడ్డావా? లేదా నన్ను భయపెట్టాలనుకున్నావా?. ఏం చేసుకుంటావో చేసుకో. నీతో మాట్లాడేందుకు నేను సిద్ధం. అనుకోకుండా నేను నటిని అయ్యా. ఇది కాకపోతే వేరే పనులు చేసుకుంటా. నీ పవర్ చూపించి నేను షేర్ చేసిన వీడియోను యూట్యూబ్ ఖాతాలో లేకుండా చేశావు కదా. నా పవర్ ఏంటో చూపిస్తా.' అంటూ ఫైరయ్యారు. (ఇది చదవండి: సమంత వ్యాధిపై సంచలన కామెంట్స్ చేసిన నటి కల్పిక) సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద, హిట్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కల్పిక ఓ యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. తన కెరీర్‌లోని అనుభవాలను ఈ ఛానెల్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ధన్య బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఇటీవల ఆమె ఓ వీడియో షేర్ చేశారు. మారి, మారి-2 చిత్రాలతో కోలీవుడ్‌లో ఫేమ్ సొంతం చేసుకున్న బాలాజీ మోహన్ అనే దర్శకుడిని ధన్య ఈ ఏడాది జనవరిలో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు కల్పిక ఆరోపించారు. బాలాజీ గతంలో తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడని తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం ధన్యతో ఆయనకు పరిచయమైందని.. నాటి నుంచి వాళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారని.. పెళ్లి అయ్యాక కూడా సంతోషంగానే ఉన్నారని ఆమె చెప్పారు. కొద్ది రోజులుగా ధన్య ఎక్కడ ప్రమోషన్స్‌లోనూ పాల్గొనలేదని.. ఆమె ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నట్లు ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: అందుకే ప్రెగ్నెంట్‌గా నటించడానికి ఒప్పుకున్నా : కల్పికా గణేష్) అయితే.. ఊహించని రితీలో ఆ వీడియో యూట్యూబ్‌లో అదృశ్యమైంది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ. 'కోలీవుడ్ స్టార్ హీరో అండ చూసుకుని.. నా ఖాతాలో ఉన్న వీడియోను బ్లాక్ చేయించారు. కానీ, నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నా ఖాతా నుంచి వాళ్లు ఎలా తొలగిస్తారు? దీనిపై నేను మరింత తెలుసుకుంటా.' అంటూ కల్పిక ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పెళ్లయిన డైరెక్టర్‌ను ధన్య బాలకృష్ణ సీక్రెట్ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు
కల్పిక గణేశ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ప్రయాణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి, పడిపడి లేచే మనసు చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె. ఇటీవలే సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద మూవీలో ముఖ్య పాత్ర పోషించింది కల్పిక. ఇదిలా ఉంటే ఈ మధ్య ఆమె తరచూ తన సహానటీనటులను టార్గెట్ చేస్తూ వారిపై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. అలా వివాదాలతో, ట్రోల్స్‌తో వార్తల్లో నిలుస్తున్న కల్పిక ఓ నటి గురించిన సంచలన విషయం బయపెట్టింది. ప్రముఖ నటి, హీరోయిన్ ధన్య బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 7th సెన్స్, నేను శైలజ, జయ జానకి నాయక వంటి చిత్రాలల్లో నటిగా అలరించిన ఆమె ఈ మధ్య వెబ్ సిరీస్‌లో సైతం నటించింది. అల్లుడు గారు, లూసర్, రెక్కీ వంటి వెబ్ సిరీస్‌లో ఆమె హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే ఆమె ఓ పెళ్లై, విడాకులైన డైరెక్టర్‌ను వివాహం చేసుకుందంటూ షాకింగ్ విషయం బయటపెట్టింది నటి కల్పిక. రీసెంట్ తన యూట్యూబ్ చానల్లో ధన్య గురించి ఈ విషయం చెబుతూ ఆమె ఓ వీడియో విడుదల చేసింది. అయితే కాపీ రైట్ ఇష్యూ కారణంగా యూట్యూబ్ ఈ వీడియోను డిలీట్ చేసింది. ఇక ఆ వీడియోలో కల్పిక మాట్లాడుతూ.. ‘ధన్య బాలకృష్ణ.. కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్‌ను ఈ ఏడాది జనవరిలో రెండో పెళ్లి చేసుకుంది. మొదటి నుంచి ఆమె చెన్నై వెళ్లినప్పుడల్లా బాలాజీ మోహన్‌తోనే ఉండేది. అయితే అప్పటికే బాలాజీకి పెళ్లయి భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. తమిళంలో సినిమాలు చేస్తున క్రమంలో బలాజీతో ఆమె పరిచయం అయ్యింది. అది కాస్తా ప్రేమగా మారడంతో వారిద్దరు సీక్రెట్ గా వివాహం చేసుకొని కాపురం కూడా పెట్టేశారు. వీరిద్దర పెళ్లయి ఏడాది కావోస్తోంది. అయినా ఇప్పటికీ తమ రిలేషన్‌ను వారు బయటకు చెప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే వారి పెళ్లి విషయం తెలిసి ధన్య గురించి నాకు భయం వేసింది. అతడు ఆమె టార్చర్ పెడతాడామో అని అనుకున్నా. కానీ, వారిద్దరు చాలా ఆన్యోన్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇప్పుడు చెప్పడానికి ఓ కారణం ఉంది. ధన్య మూవీ ప్రమోషన్స్‌కి రావడం లేదు. ఈ విషయంలో బాలాజీ ఆమెను ఇబ్బంది పెడుతున్నాడెమో అనిపించింది. అందుకే నేను ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే కాపీ రైట్ ఇష్యూ కారణంగా యూట్యూడ్ ఈ వీడియోను డిలీట్ చేసింది. అయితే ఇది డైరెక్టర్ బలాజీనే వీడియోను డిలిట్ చేయించారని ఆరోపిస్తు ఆమె తన ఫేస్బుక్లో ఓ పోస్ట్ షేర్ చేయడం గమనార్హం. View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Balaji Mohan (@directormbalaji) -
ఆస్పత్రి బెడ్‌పై కల్పికా గణేశ్, ఫొటో వైరల్
ప్రయాణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి, పడిపడి లేచే మనసు చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి కల్పికా గణేశ్. ఇటీవలే సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద మూవీలో ముఖ్య పాత్ర పోషించింది కల్పిక. అయితే హీరోయిన్స్ కంటే అందంగా కనిపిస్తున్నానని తనను పక్కన పెడుతున్నారని దానివల్లే తక్కువ సినిమాలు చేశానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అంతేగాక సమంతలాగే తాను కూడా పదమూడేళ్లుగా మయోసైటిస్‌తో పోరాడుతున్నాడన్న విషయాన్ని బయటపెట్టింది. ఈ క్రమంలో తాజాగా కల్పిక ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. లుంబార్ రాడిక్యులోపతి విజయవంతమైందని తెలిపింది. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్.. నా పోరాటం చివరికి ఎలాంటి సత్ఫలితాలనిస్తుందో చూడాలి అని రాసుకొచ్చింది. కల్పిక రాడిక్యులర్ పెయిన్‌కు ఆమె ఈ చికిత్స చేయించుకుంది. రాడిక్యులర్ పెయిన్ అంటే వెన్నెముక ద్వారా నొప్పి తొడలు, పాదాల వరకు ప్రయాణిస్తుంది. దీనివల్ల మనిషి ఎక్కువసేపు నిల్చోలేకపోవడంతోపాటు బలహీనంగా మారుతారు. కాగా పదమూడేళ్లుగా మయోసైటిస్‌తో పోరాడుతున్న కల్పికా త్వరలోనే కోలుకుని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు. చదవండి: నరాలు కట్టయ్యాయా శివ? రాజ్‌తో పిచ్చిగా వాగుతున్నావ్! ఆదిరెడ్డి వర్సెస్ శ్రీహాన్.. నామినేషన్స్‌లో ఆరుగురు -
హీరోయిన్స్ కంటే అందంగా ఉన్నానని..!
-
హీరోయిన్స్ కంటే అందంగా కనిపిస్తున్నానని పక్కన పెడుతున్నారు: ‘యశోద’ నటి
నటి కల్పికా గణేష్ పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. 2009లో వచ్చిన ప్రయాణం సినిమాతో నటిగా పరిచయమైన ఆమె ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి, పడిపడి లేచే మనసు వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి గుర్తింపు పొందింది. రీసెంట్గా ఆమె సమంత యశోద సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇంతకాలం సైలెంట్‌గా సినిమాలు చేసుకుంటూ వచ్చిన కల్పిక ఈ మధ్య వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు నేను ఓ 30 సినిమాలు చేశాను. వాటిలో 15 చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు చేసిన తరువాత నన్ను పక్కన పెట్టడం చేశారు. ఎందుకంటే హీరోయిన్స్ కంటే అందంగా కనిపిస్తున్నానని, బాగా చేస్తున్నానంటున్నారు. దాంతో సినిమాలో హీరోయిన్ డామినేట్ చేస్తున్నాననే కారణాలుగా కనిపించాయి. నేను చంద్రశేఖర్ యేలేటి గారి స్కూల్ నుంచి వచ్చాను. కానీ అలాంటి వాతావరణం బయట ఎక్కడా కనిపించలేదు. డైలాగ్ ఉందా అని అడిగితే ‘నీకు కాస్త యాటిట్యూడ్ ఎక్కువ’ అనేవారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు వరుస సినిమాలు చేస్తూ వెళుతుంటారు. కానీ నేను అలా కదు. నాకు పాత్ర, కథ నచ్చితేనే చేస్తాను. బహుషా నేను తక్కువ సినిమాలు చేయడానికి ఇదే కారణం అనుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్ బిజినెస్ విమెన్‌తో పెళ్లి.. నాగశౌర్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా? -
సమంత వ్యాధిపై సంచలన కామెంట్స్ చేసిన నటి కల్పిక
నటి కల్పికా గణేష్ పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు, పడిపడి లేచే మనసు వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన కల్పికా రీసెంట్గా యశోద సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా తెరపైకి వస్తున్న కల్పిక తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కల్పిక కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో తనకు వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపింది. ఓ కాలేజీ ఫంక్షన్లో గెస్టుగా పిలిచి అవమానించారని, దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఓ వర్గం తనను టార్గెట్ చేసిందంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ విషయంలో తనపై పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారని తెలిపింది. ఇక సమంత లాగే తనకు కూడా మయోసైటిస్ ఉందని, గత 13 ఏళ్లుగా ఈ వ్యాధితో పోరాడుతున్నట్లు చెప్పింది. అయితే తాను ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నట్లు చెప్పిన కల్పిక సమంత మాత్రం థర్డ్ స్టేజ్‌లో ఉందని, ఆమె త్వరగా కోలుకోవాలని పేర్కొంది. -
విడుదలకు సిద్ధమైన తమిళ సినిమా 'పెరోల్'
తమిళసినిమా: ట్రిపుల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మధుసూదన్ నిర్మిస్తున్న చిత్రం పెరోల్. ద్వారకా రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆర్ఎస్ కార్తీక్, లింగ, కల్పిక, మనీషా మురళి, వినోదిని, వైద్యనాథన్, జానకి సురేష్, మైక్ మణి, శివం, డేనియల్ ఇమానువేల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్‌కుమార్ అమల్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వివరాలు తెలుపుతూ నిర్మాత తనపై నమ్మకం ఉంచి చిత్రాన్ని తెరకెక్కించడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు. ఇది కుటుంబ నేపథ్యంలో మనం చూడని కోణాన్ని ఆవిష్కరించే విభిన్న కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో నటీనటులు పూర్తి అంకితభావంతో నటించారని చెప్పారు. ఇందులో పురుషులు కలిగించే సమస్యలను స్త్రీలు పరిష్కరిస్తారన్నారు. ఇందులో నటించిన నటీమణులు ఆ భావోద్వేగాలను చక్కగా ప్రతిఫలింపజేశారన్నారు. చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన ఆర్ఎస్ కార్తీక్ మాట్లాడుతూ ఈ చిత్రం ఒక తల్లికి ఇద్దరు కొడుకుల మధ్య జరిగే కథ అని తెలిపారు. ఇది నార్త్ చెన్నై నేపథ్యంలో సాగే కథా చిత్రం అని చెప్పారు. నార్త్ చెన్నై నేపథ్యంలో సాగే కథలు బలంగా ఉంటాయన్నారు. అలా ఇందులోని పాత్రలన్నీ ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంటాయన్నారు. ఇలాంటి చిత్రాలు విజయం సాధిస్తే మరిన్ని మంచి కథా చిత్రాలు వస్తాయన్నారు. నాలాంటి నవ సంగీత దర్శకులకు ఇది డ్రీమ్ చిత్రమని రాజ్‌కుమార్ అమల్ పేర్కొన్నారు. దీనికి పని చేయటం చాలా మంచి అనుభవంగా పేర్కొన్నారు. తన ప్రతిభను చాటుకోవడానికి మంచి స్కోప్గా ఉన్న చిత్రం పెరోల్ అని అన్నారు. -
అభినవ్‌తో నటి కల్పిక మాటల యుద్ధం.. స్క్రీన్‌షాట్స్ వైరల్
నటి కల్పికా గణేష్ గుర్తుందా? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు చిత్రంలో సమంతకు అక్కగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తుంది. అయితే కొద్దిరోజులుగా కల్పికా గణేష్ పేరు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. నటుడు అభినవ్ గోమటంతో కల్పికా సోషల్ వార్‌కు దిగింది. ఇంతకీ ఏమైందంటే.. ఇటీవలె ఓ షోలో కల్పికకు బెస్ట్ సపోర్టింగ్ రోల్ కింద అవార్డు వరించిందట. దీనిపై అభినవ్ చాలా వ్యంగ్యంగా మాట్లాడాడట. ఇప్పుడు ఈ అంశమే వీరిద్దరి మధ్య మాటల యుద్ధాన్ని రాజేస్తుంది. తన పనిని అభినవ్ అమానించాడని పేర్కొంటూ అతడు తనకు క్షమాపణలు చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా అభినవ్ గోమటం ఫ్రెండ్స్‌ని కూడా ట్యాగ్ చేస్తూ అతడితో సారీ చెప్పించాలంటూ సవాలు చేస్తుంది. అటు అభినవ్ కూడా .. కల్పికాకు క్షమాపణలు చెప్పేది లేదని, ఆమె కావాలనే తనను టార్గెట్ చేస్తుందంటూ ఫైర్ అయ్యాడు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ని కూడా కల్పికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఇలా మహిళలను తక్కువ చేసేలా మాట్లాడటమే కాకుండా గౌరవం ఇవ్వని ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ కల్పికా డిమాండ్ చేస్తుంది. కాగా అభినవ్ గోమటం ఈ నగరానికి ఏమైంది, శ్యామ్‌సింగరాయ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.