Director Balaji Mohan Confirms Marriage With Actress Dhanya Balakrishnan, Deets Inside - Sakshi
Sakshi News home page

Dhanya Balakrishna Marriage: డైరెక్టర్‌తో ధన్య బాలకృష్ణ సీక్రెట్‌ పెళ్లి..అవును ఇది నిజమే..!

Dec 28 2022 6:25 PM | Updated on Dec 28 2022 7:29 PM

Director Balaji Mohan confirms marriage to actor Dhanya Balakrishna - Sakshi

ప్రముఖ నటి, హీరోయిన్‌ ధన్య బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 7th సెన్స్‌, నేను శైలజ, జయ జానకి నాయక వంటి చిత్రాలల్లో నటిగా అలరించిన ఆమె ఈ మధ్య వెబ్‌ సిరీస్‌లో సైతం నటించింది. అల్లుడు గారు, లూసర్‌, రెక్కీ వంటి వెబ్‌ సిరీస్‌లో ఆమె హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే ఆమె ఓ పెళ్లై, విడాకులు తీసుకున్న ఓ డైరెక్టర్‌ను వివాహం చేసుకుందంటూ షాకింగ్‌ న్యూస్ బయటకొచ్చింది.  ఈ విషయాన్ని మరో నటి కల్పిక గణేశ్ తన యూట్యూబ్‌ చానల్లో ధన్య గురించి ఈ విషయం చెబుతూ గతంలో ఓ  వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

(ఇది చదవండి: పెళ్లయిన డైరెక్టర్‌ను ధన్య బాలకృష్ణ సీక్రెట్‌ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు)

తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు బాలాజీ మోహన్ ధ్రువీకరించారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు కోర్టుకు తెలిపారు. కల్పిక గణేశ్ తనపై, తన భార్య ధన్య బాలకృష్ణపై పరువు నష్టం కలిగించేలా యూట్యూబ్‌లో వీడియో విడుదల చేసిందని కోర్టుకు సమర్పించారు. తన వ్యక్తిగత పరువుకు భంగం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని దర్శకుడు ఆరోపించాడు.

అయితే బాలాజీ మోహన్, నటి ధన్య బాలకృష్ణ జనవరి 2020 నెలలోనే వివాహం చేసుకున్నారు. బాలాజీ మోహన్‌కిది రెండో వివాహం. అతను ఇదివరకే అరుణను వివాహం చేసుకున్నారు. ‘మారి’, ‘మారి 2’, ‘వాయై మూడి పేసవుం’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ధన్య బాలకృష్ణ ప్రధానంగా తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలలో పని చేస్తోంది. ఆమె 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'కార్బన్', 'రాజు గారి గది' వంటి చిత్రాలలో నటించింది.

Advertisement
 
Advertisement
Advertisement