తెలుగు నటి కల్పికపై మరో కేసు | Another Police Case On Actress Kalpika | Sakshi
Sakshi News home page

Kalpika: నటిపై మరో కేసు.. ఈసారి ఏం చేసిందంటే?

Jun 14 2025 3:59 PM | Updated on Jun 14 2025 4:39 PM

Another Police Case On Actress Kalpika

కొన్నిరోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ క్లబ్‌లో నటి కల్పిక నానా హంగామా చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈమెపై మరో కేసు నమోదైంది. ఇన్ స్టాలో తనని అసభ్య పదజాలంతో దూషించిందని కీర్తన అనే యువతి.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించింది. ఆన్ లైన్ వేదికగా తనని వేధిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలని కూడా కీర్తన.. పోలీసులకు అందించారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(ఇదీ చదవండి: 'టూరిస్ట్ ఫ్యామిలీ' దర్శకుడితో నాని.. పోస్ట్ వైరల్)

కల్పిక గతంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'పడిపడి లేచే మనసు' తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది. కానీ గత రెండు మూడేళ్ల నుంచి ఈమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం ఓ క్లబ్‌లో తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్లి రచ్చ చేసింది. అదికాస్త పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేశారు.

అయితే కల్పిక వ్యవహారం చూస్తుంటే ఈమె ఏమైనా బిగ్‌బాస్ షోలో అడుగుపెడుతుందా అనే అనుమానం వస్తోంది. ఎందుకంటే గతేడాది కూడా ఇలానే ఆర్జే శేఖర్ బాషా.. రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారంలో ఉన్నాడు. అలా ఇతడిపై పోలీసులు కేసు కూడా పెట్టారు. ఇది జరిగిన కొన్నిరోజులకే బిగ్‌బాస్ హౌసులో అడుగుపెట్టాడు. మరి కల్పిక కూడా ఇలా ఏమైనా చేస్తుందా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: హైదరాబాద్ జట్టు ఓనర్‌తో అనిరుధ్ పెళ్లి?

Advertisement
 
Advertisement
Advertisement