
దాదాపు నెలరోజుల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో అర్థరాత్రి నటి కల్పిక హంగామా చేసింది. ఈ విషయమై ఆమెపై పోలీసులు కేసు కూడా పెట్టారు. అది ఇంకా విచారణలో ఉంది. ఇప్పుడు మరోసారి కల్పిక.. హైదరాబాద్ సమీపంలో మొయినాబాద్‌లో ఉన్న ఓ రిసార్ట్‌లో హడావుడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్ మొయినాబాద్ ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్‌కి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్‌లో ఒంటరిగా వచ్చిన కల్పిక.. రిసెప్షన్‌లో అడుగు పెట్టగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మెనూ కార్డ్ విసిరేయడం, రూమ్ తాళాల్ని మేనేజర్ ముఖంపై విసరడం, అసభ్యంగా బూతులు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించడం లాంటివి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా)
అయితే తాను సిగరెట్లు కావాలని అడిగితే రిసార్ట్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించిందని కల్పిక.. ఈ వివాదంపై స్పందించింది. ఓ వీడియోని కూడా రికార్డ్ చేసింది. రిసార్టులో సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేవని, కనీసం క్యాబ్ బుక్ చేసుకునేందుకు వైఫై కూడా లేదని అడిగితే తనతో మేనేజర్ వాగ్వాదానికి దిగాడని చెప్పుకొచ్చింది. ఎంత నిదానంగా చెప్పినా వినకపోవడంతో, మేనేజర్‌తో గొడవకు దిగాల్సి వచ్చిందని చెప్పింది.
గత కొన్నాళ్లుగా కల్పిక సరిగా సినిమాలు చేయడమే లేదు. అలాంటిది ఇప్పుడు వరస వివాదాల్లో నిలిచి ఈమె వార్తల్లో నిలిచింది. ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకే చేస్తుందా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే త్వరలో ప్రారంభమయ్యే బిగ్‌బాస్ కొత్త సీజన్‌లో కల్పిక కూడా ఓ కంటెస్టెంట్‌గా ఉండనుందనే టాక్ వినిపిస్తోంది. అందుకేనా ఈ హడావుడి అంతా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: కింగ్డమ్ నుంచి గూస్ బంప్స్ తెప్పించే సాంగ్ రిలీజ్)