
'కింగ్డమ్' మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఓ ప్రమోషనల్ ఈవెంట్ చేశారు. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లైవ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలానే 'రగిలే రగిలే' అని సాగే ఓ పాటని పాడాడు. ఇప్పుడు ఆ గీతానికి సంబంధించిన లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. వింటుంటేనే గూస్ బంప్స్ తెప్పిస్తోంది ఈ సాంగ్.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా)
ఈ మూవీ అంతా అన్నదమ్ముల బ్యాక్ డ్రాప్ యాక్షన్ స్టోరీతో తీశారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో ఆ క్లారిటీ వచ్చింది. విజయ్ దేవరకొండ తమ్ముడు కాగా, సత్యదేవ్ అన్నగా నటించాడు. దాదాపు శ్రీలంకలోనే సినిమా అంతా చిత్రీకరించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు రిలీజ్ చేసిన 'రగిలే రగిలే' పాట బహుశా క్లైమాక్స్‌లో ఉండొచ్చనిపిస్తోంది.
(ఇదీ చదవండి: అల్లు అరవింద్‌కు 'మహావతార్ నరసింహా' వరం)