
కోలీవుడ్ నటుడు సూరి ప్రధాన పాత్రలో నటించిన 'మామన్' సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 16న తమిళ్లో విడుదలైంది. అయితే, సమ్మర్ బ్లాక్‌బస్టర్ చిత్రంగా మామన్ నిలిచింది. ప్రతి కుటుంబంలో కనిపించే బాంధవ్యాలను ఆధారంగా చేసుకుని ఈ మూవీని నిర్మించారు. మనందరి జీవితంలో మేనమామ బంధం గొప్పదని, అది తల్లి తర్వాతి స్థానమని ఈ చిత్రం ద్వారా వెల్లడించారు. స్వాసిక, ఐశ్వర్య లక్ష్మీ, రాజ్‌కిరణ్, రాజేంద్రన్ వంటి నటీనటులు నటించారు.

మామన్ చిత్రం జీ5 తమిళ్లో విడుదల కానున్నట్లు ప్రకటించారు. రాఖీ పండుగ సందర్భంగా అగష్టు 8న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే, తమిళ్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందరూ చూడొచ్చు. కానీ, తెలుగులో కూడా ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురావలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'అక్క తమ్ముడు' బంధాన్ని చాలా ఎమోషనల్గా ఈ చిత్రంలో చూపించారు. ఆపై అక్క బిడ్డల కోసం మేనమామగా చేయాల్సిన బాధ్యతలను నేటి సమాజానికి గుర్తుచేసేలా ఈ చిత్రం ఉంది.