మా పేరేంట్స్‌కు కూడా తెలుసు: టాలీవుడ్ నటి | Tollywood Actress Kalpika Ganesh Clarity On Pub Issue, Check Out More Insights | Sakshi
Sakshi News home page

కానీ ఆ రోజు మాత్రం: కల్పికా గణేశ్

Jun 4 2025 7:34 AM | Updated on Jun 5 2025 12:40 PM

Tollywood Actress Kalpika Ganesh Clarity On Pub Issue

టాలీవుడ్ నటి కల్పికా గణేశ్ ఇటీవల వార్తల్లో నిలిచింది. తన బర్త్‌ డే సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. కానీ అదే సమయంలో పబ్‌ సిబ్బందితో గొడవ జరిగింది. బర్త్ డే కేక్ విషయమై పబ్ నిర్వహకులకు, ఆమెకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను నటి కల్పిక తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. తనపై పబ్ నిర్వహకులు దురుసుగా ప్రవర్తించారని కల్పిక చెప్పింది. అయితే ఆ తర్వాత ఆమె పబ్లిసిటీ కోసమే ఇదంతా చేశారని వార్తలొచ్చాయి.

తాజాగా ఈ అంశంపై నటి కల్పికా గణేశ్ స్పందించింది. తానేలాంటి పబ్లిసిటీ స్టంట్ చేయలేదని తెలిపింది. బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే మీరు ఇలా చేశారని కొందరు అంటున్నారని ప్రశ్నించగా.. వాళ్లే నన్ను చూడాలనుకుంటున్నారేమో అని సమాధానమిచ్చింది. బర్త్ డే పార్టీలో తాను మందు తాగలేదని వెల్లడించింది. తనకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందని.. ఈ విషయం నా ఫ్రెండ్స్‌కు, తల్లిదండ్రులకు కూడా తెలుసని పేర్కొంది. గతంలో తాను ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ ఫంక్షన్లలో ఆల్కహాల్ తీసుకునేదాన్ని తెలిపింది. ప్రస్తుతానికి మందుతాగి దాదాపు రెండు, మూడేళ్లయిందని.. ఆ రోజు కేవలం వార్మ్‌వాటర్‌ మాత్రమే తీసుకున్నట్లు కల్పికా గణేశ్ అంటోంది. మరోవైపు కల్పికా కావాలనే ఇదంతా చేసిందని.. కేవలం ఫేమ్ కోసమేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

(ఇది చదవండి: హైదరాబాద్ పబ్‌లో తెలుగు నటి హంగామా.. వీడియో వైరల్)

కాగా.. రామ్ చరణ్ 'ఆరెంజ్' మూవీలో జెనీలియా ఫ్రెండ్‌గా నటించిన కల్పిక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఈమెకు పెద్దగా ఆఫర్స్ లేవు. ఇలాంటి ఈ టైంలో వివాదం ద్వారా వార్తల్లో నిలిచింది.

 

Advertisement
 
Advertisement
Advertisement