నాని హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఓ జాతి మనుగడ కోసం చేసే పోరాటం ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ అనుకన్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫలితం గురించి ప్రముఖ టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. ది ప్యారడైజ్ మూవీపై నెగెటివ్ ప్రచారం చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే ది ప్యారడైజ్పై నెగెటివ్ ప్రచారం చేశారని విమర్శించారు. ఈ మూవీ గురించి నెగెటివ్ రాయొద్దని చెప్పినవాళ్లే.. ఆ పని చేశారని తమ్మారెడ్డి ఆరోపించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా స్పందించారు.


