కమెడియన్‌కు అండగా ఆ హీరో .. ఎన్టీఆర్ సాయం కోరిన రామచంద్ర.. | Comedian Ramachandra Gets Financial Aid From Hero Sanjosh NTR Help Promised | Sakshi
Sakshi News home page

Comedian Ramachandra: కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ ఆర్థిక సాయం..

Oct 18 2026 2:35 PM | Updated on Oct 18 2026 2:48 PM

Comedian Ramachandra Gets Financial Aid From Hero Sanjosh NTR Help Promised

టాలీవుడ్‌ కమెడియన్‌ రామచంద్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. బ్రెయిన్‌ ట్యూమర్‌, పక్షవాతంతో చికిత్స పొందుతున్న ఆయనకు హీరో సంజోష్‌ అండగా నిలిచారు. తాజాగా రామచంద్రను పరామర్శించిన సంజోష్‌.. వైద్య ఖర్చుల కోసం 15000 ఆర్థిక సాయం అందించారు. అంతేకాకుండా, ఆయనకు మరింత సాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

చికిత్సకు మరో రూ.8 లక్షలు..
కమెడియన్‌ రామచంద్ర చికిత్స కోసం ఇంకా సుమారు రూ.8 లక్షలు అవసరమని తెలుసుకున్న సంజోష్‌.. ఆయనకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని జూనియర్‌ ఎన్టీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని కోరగా.. ఎన్టీఆర్‌ అన్నకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తానని సంజోష్‌ చెప్పారు.

సినీ ప్రముఖులకు సంజోష్‌ విజ్ఞప్తి
ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రామచంద్రకు సినీ పరిశ్రమకు చెందిన వారంతా అండగా నిలవాలని సంజోష్‌ కోరారు. సినిమా కుటుంబమంతా ఒక్కటై సాయం చేస్తే ఆయన చికిత్సకు అవసరమైన నిధులు సమకూరుతాయని పేర్కొన్నారు. గతంలోనూ పలువురికి ఆర్థిక సాయం అందించిన సంజోష్‌.. మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.

కాగా వెంకీ సినిమాలో ‘బుజ్జి’ పాత్రతో రామచంద్రకు మంచి గుర్తింపు వచ్చింది. వెంకీ, దుబాయ్ శీను, సొంతం, దరువు వంటి పలు హిట్ సినిమాల్లో హాస్య పాత్రల్లో నటించారు.  రామచంద్ర త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

(ఇదీ చదవండి: జైలర్‌2లో అవకాశం.. నటి పూర్ణ ఎమోషనల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement