రజనీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ జైలర్-2. గతంలో రిలీజైన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. మూడు రోజుల్లోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం త్రీ డేస్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల వసూళ్లు దాటేసింది.
అయితే ఈ చిత్రంలో నటి పూర్ణ చేసిన డ్యాన్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీంతో ఈ అవకాశం రావడంపై చిత్ర బృందానికి థ్యాంక్స్ పూర్ణ పోస్ట్ చేసింది. ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది.
అందరూ ఇలానే కోరుకుంటారు
‘రజనీకాంత్‌తో నటించాలని అందరూ కోరుకుంటారు. ఆ అవకాశం నాకూ వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఆయనకు నేను పెద్ద వీరాభిమానిని. ఆయన నటించిన ‘నరసింహ’ ఎంతో ఇష్టం. జైలర్2 ప్రాజెక్టులో పాట చేసే అవకాశం వస్తుందని అనుకోలేదు. దీనికి డైరెక్టర్ నెల్సన్ సార్‌కు చాలా థ్యాంక్స్. ప్రేక్షకుల స్పందన చూశాను. వారికి కృతజ్ఞతలు . మన కష్టం, పని పట్ల ఉన్న అంకితభావానికి ఎప్పటికైనా తగిన ఫలితం దక్కుతుంది. ఇప్పుడు నాకు అలాంటి ఫలితమే దక్కింది’ అని ఆమె ఎమోషనల్ అయ్యారు.
(ఇదీ చదవండి: ప్రభాస్ ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ వచ్చేసింది..)


