గత నెలలో థియేటర్లలో రిలీజైన సినిమా 'ద ప్యారడైజ్'. నాని హీరో కాగా శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది కానీ వాటిని అందుకోలేక చతికిలపడింది. కంటెంట్ పరంగా విమర్శలు వచ్చినప్పటికీ పాటల పరంగా బ్లాక్ బస్టర్ అందుకుంది. అనిరుధ్ స్వరపరిచిన ప్రతి పాట శ్రోతల్ని తెగ నచ్చేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)
మరీ ముఖ్యంగా నాని, కీర్తి సురేశ్ కలిసి చేసిన ఐటమ్ సాంగ్ 'యేషనాగుల కట్టమీద' అయితే రిలీజైనప్పుడు తెగ మోగింది. ఈ వారం సినిమా ఓటీటీలోకి వచ్చేయబోతున్న సందర్భంగా ఈ పాట వీడియో సాంగ్‌ని యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. మీరు ఓ లుక్కేసేయండి.
(ఇదీ చదవండి: 'ప్రేమలు 2'.. మాకు ఏడాది వేస్ట్ అయిపోయింది.)


