Kalpika Ganesh: నేను తలుచుకుంటే నాశనమే.. కల్పిక షాకింగ్‌ కామెంట్స్‌..!

Kalpika Ganesh Fire On another Actress Dhanya Balakrishna on Youtube video - Sakshi

నటి ధన్య బాలకృష్ణ, మరో నటి కల్పిక గణేశ్ మధ్య తాజాగా ఓ వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే షాకింగ్‌ ఆరోపణలు చేశారు మరో నటి కల్పికా గణేశ్.  కల్పికా గణేశ్ మాట్లాడుతూ.. ' నువ్వు నన్ను వివాదంలోకి లాగుతున్నావు. సరే అయితే కోర్టులో కలుసుకుందాం. నీ విషయాలు బయటపెట్టే సరికి ఇన్నాళ్లు నన్ను బ్లాక్‌ చేసిన నువ్వు.. రాత్రి అన్‌బ్లాక్‌ చేసి వరుసగా కాల్స్‌ చేశావు. అంటే నువ్వు భయపడ్డావా? లేదా నన్ను భయపెట్టాలనుకున్నావా?. ఏం చేసుకుంటావో చేసుకో. నీతో మాట్లాడేందుకు నేను సిద్ధం.  అనుకోకుండా నేను నటిని అయ్యా. ఇది కాకపోతే వేరే పనులు చేసుకుంటా. నీ పవర్‌ చూపించి నేను షేర్‌ చేసిన వీడియోను యూట్యూబ్‌ ఖాతాలో లేకుండా చేశావు కదా. నా పవర్‌ ఏంటో చూపిస్తా.' అంటూ ఫైరయ్యారు. 

(ఇది చదవండి: సమంత వ్యాధిపై సంచలన కామెంట్స్‌ చేసిన నటి కల్పిక)

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద, హిట్‌ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కల్పిక ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. తన కెరీర్‌లోని అనుభవాలను ఈ ఛానెల్‌ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ధన్య బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఇటీవల ఆమె ఓ వీడియో షేర్‌ చేశారు. 

మారి, మారి-2 చిత్రాలతో కోలీవుడ్‌లో ఫేమ్ సొంతం చేసుకున్న బాలాజీ మోహన్‌ అనే దర్శకుడిని ధన్య ఈ ఏడాది జనవరిలో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు కల్పిక ఆరోపించారు. బాలాజీ గతంలో తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడని తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం ధన్యతో ఆయనకు పరిచయమైందని.. నాటి నుంచి వాళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని.. పెళ్లి అయ్యాక కూడా సంతోషంగానే ఉన్నారని ఆమె చెప్పారు. కొద్ది రోజులుగా ధన్య ఎక్కడ ప్రమోషన్స్‌లోనూ పాల్గొనలేదని.. ఆమె ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నట్లు ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

(ఇది చదవండి: అందుకే ప్రెగ్నెంట్‌గా నటించడానికి ఒప్పుకున్నా : కల్పికా గణేష్‌)

అయితే.. ఊహించని రితీలో ఆ వీడియో యూట్యూబ్‌లో అదృశ్యమైంది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ. 'కోలీవుడ్‌ స్టార్‌ హీరో అండ చూసుకుని.. నా ఖాతాలో ఉన్న వీడియోను బ్లాక్‌ చేయించారు. కానీ, నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నా ఖాతా నుంచి వాళ్లు ఎలా తొలగిస్తారు? దీనిపై నేను మరింత తెలుసుకుంటా.' అంటూ కల్పిక ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top