Rishi Sunak: సారీ.. నేను చేసింది తప్పే.. ప్రజలకు రిషి సునాక్ క్షమాపణలు

UK PM Rishi Sunak Apologizes For Not Wearing Seat Belt - Sakshi

లండన్‌: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తాను చేసింది తప్పే అని ఒప్పుకున్నారు.  కారులో ప్రయాణిస్తూ సీటు బెల్టు ధరించనందుకు తీవ్ర విమర్శలు రావడంతో ఆయన ఈమేరకు స్పందించారు. రిషి అధికార ప్రధినిధి జేమీ డేవిస్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఓ ప్రచార కార్యక్రమం కోసం వీడియో చిత్రీకరిస్తుండగా రిషి సునాక్‌ కారులో వెనకాల కూర్చొని మాట్లాడారు. ఈ సమయంలో ఆయన సీటు బెల్టు ధరించలేదు. దీంతో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని అయి ఉండి రూల్స్ పాటించకపోవడంపై నెటిజన్లు మండిపడ్డారు. దీంతో రిషి తన తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పారు.

గతంలో కరోనా ఆంక్షల సమయంలో కూడా రిషి నిబంధనలు అతిక్రమించారు. పోలీసులు అందుకు జరిమానా కూడా విధించారు. అప్పుడు కూడా ప్రజల ఆగ్రహానికి గురై విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోమారు ఇరకాటంలో పడ్డారు.

దీన్నే అవకాశంగా తీసుకున్న ప్రతిపక్ష లేబర్ పార్టీ రిషిపై విమర్శలతో విరుచుకుపడింది. గతంలో ఓసారి ఆయన కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డును ఉపయోగించేందుకు ఇబ్బంది పడిన విషయాన్ని గుర్తు చేసింది. 'రిషి సునాక్‌కు సీటు బెల్టు పెట్టుకోవడం రాదు. డెబిట్ కార్డు ఉపయోగించడం రాదు. రైలు సేవలు, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా తెలియదు' అని లేబర్ పార్టీ ఎద్దేవా చేసింది.
చదవండి: బాప్‌రే!..పాత సామాన్లు అమ్ముకున్న ఎలాన్‌ మస్క్‌, ఏ వస్తువు ఎంత ధర పలికిందంటే

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top