అరెస్ట్​కి​ డిమాండ్​.. నటి యువిక క్షమాపణలు

Yuvika Chaudhary Apology For Castiest Slur in Vlog - Sakshi

సాక్షి, ముంబై : క్షణికావేశంలో నోరు జారడం.. ఇబ్బందులు చుట్టుముట్టాక క్షమాపణలు చెప్పడం సెలబ్రిటీలకు అలవాటుగా మారింది. అయితే ఏకంగా అరెస్ట్ చేయాలనేంత డిమాండ్​ బహుశా బాలీవుడ్ నటి యువికా చౌదరి విషయంలోనే జరిగిందేమో!. నిమ్న వర్గాలను కించపరిచేలా కామెంట్ చేసిందంటూ #ArrestYuvikaChaudhary హ్యాష్​ ట్యాగ్​తో విరచుకుపడ్డారు ట్వీపుల్స్​. 

ఈ మేరకు ఇన్​స్ట్రామ్​లో చేతులు జోడించి ఆమె నెటిజన్స్​కి క్షమాపణలు చెప్పుకుంది. తాను మాట్లాడింది ఆ అర్థంతో కాదని, మాట్లాడేటప్పుడు తాను సోయి లేకుండా వ్యవహరించానని కామెంట్ చేసింది. తన వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని కోరుతూ ఆ వీడియోలో ఆమె కోరింది. మరోవైపు తనకు ఎవరీని నొప్పించే ఉద్దేశం లేదని ట్విట్టర్​లో ఓ ట్వీట్​ యువిక. ‘ఫిర్​ బీ దిల్​ హై హిందుస్థానీ’, ఓం శాంతి ఓం లాంటి సినిమాలతో పాటు డజనుకి పైగా టీవీ షోలతో 37 ఏళ్ల యువిక నార్త్​ ఆడియొన్స్​లో మంచి క్రేజ్​ దక్కించుకుంది.

నటి యువికా చౌదరికి ఒక యూట్యూబ్ వ్లోగ్ ఉంది. అందులో తన భర్త హేయిర్ క్రాఫ్​ చేయించుకుంటుండగా వీడియో తీసింది ఆమె. ఆ టైంలో వ్లోగ్​ వీడియో తీసిన ప్రతీసారి తన అవతారం భంగీ(దళితులు, డ్రైనేజీలు శుభ్రం చేసేవాళ్లు)ల్లాగే ఎందుకు ఉంటుందో తెలియడం లేదని కామెంట్ చేసింది. ఆ కామెంట్​పై నెటిజన్స్​ విరుచుకుపడ్డారు. యువికాను అరెస్ట్​ చేయాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్​లో రెండు రోజులగా హ్యాష్​ట్యాగ్​లతో ట్రెండ్ నడిపించారు. దీంతో యువికా క్షమాపణలు చెప్పింది. ఇక బుల్లితెరపై మరో నటి మున్​ మున్​ దత్తా యూట్యూబ్​లో ఈ తరహా కామెంట్లు చేయడంతో ఆమెపై ఎస్సీఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు అయ్యింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top