జూమ్​లో అసభ్య చేష్టలు: ఎనిమిది నెలల తర్వాత..

Jeffrey Toobin Apology For Zoom Call Incident - Sakshi

న్యూయార్క్​: అమెరికా న్యూస్​ పర్సనాలిటీ జెఫెర్రె టూబిన్ ఎనిమిది నెలల గ్యాప్​ తర్వాత హఠాత్తుగా టీవీ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పటి నుంచి ప్రముఖ న్యూస్​ ఛానెల్ సీఎన్​ఎన్​లో లీగల్ అనలిస్ట్​గా ఆయన పని చేయనున్నారు.​ పోయినేడాది అక్టోబర్​లో జూమ్​ కాల్​లో ఆయన అసభ్య చేష్టలకు పాల్పడడంతో ప్రపంచం నివ్వెరపోయింది. ఈ చర్యతో ది న్యూయార్కర్ ఆయన్ని అనధికారికంగా​ విధుల నుంచి తప్పించింది. కాగా, తన చేష్టలకు ఆయన అందరికీ క్షమాపణలు చెబుతూ కొత్త విధుల్ని ప్రారంభించడం విశేషం.
 
‘‘ఆరోజు నేను చాలా మూర్ఖంగా నేను ప్రవర్తించా. ఇతరులు చూస్తారనే ధ్యాస నాకు లేదు. నా కుటుంబానికి, సహచర జర్నలిస్టులకు, అందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నా. నా చేష్టలను ఎట్టిపరిస్థితుల్లో సమర్థించుకోలేను. ఆ ఘటన తర్వాత మామూలు మనిషిగా మారేందుకు టైం పట్టింది. మానసిక ప్రశాంతత కోసం థెరపీ తీసుకున్నా. ఒక ఫుడ్​ బ్యాంక్​లో పని చేశా. ఓక్లాహోమా సిటీ పేలుళ్ల గురించి ఒక బుక్​ రాయడంలో లీనమయ్యా’’ అని 61 ఏళ్ల టూబిన్​ చెప్పుకొచ్చాడు.

కాగా, అక్టోబర్​ 19, 2020న న్యూయార్కర్​, డబ్ల్యూఎన్​వైసీ రేడియో స్టాఫర్స్​ మధ్య జూమ్​ మీటింగ్ జరుగుతుండగా..  టూబిన్​ తన వ్యక్తిగత వీడియో కాల్​లో ఎవరితోనో మాట్లాడుతూ, హస్తప్రయోగం చేసుకున్నాడనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై దిగ్భ్రాంతి చెందిన న్యూయార్కర్​.. ఆయన్ని విధుల నుంచి దూరంగా ఉంచింది. కాగా, దాదాపు మూడు దశాబ్దాలుగా న్యూయార్కర్​తో అనుబంధం ఉన్న టూబిన్​.. జూమ్ చేష్టల ద్వారా జర్నలిజానికి మాయని మచ్చ వేశాడంటూ జిమ్మీ ఫాలోన్​, డొనాల్డ్​ ట్రంప్​ జూనియర్​ లాంటి ప్రముఖులు.. శాటర్​ డే నైట్​ లైవ్​ ప్రోగ్రాం దుమ్మెత్తిపోశారు. లా స్టూడెంట్​గా ఉన్నప్పటి నుంచే మానవీయ కోణంలో ఎన్నో పుస్తకాలు రాసి ప్రపంచవ్యాప్తంగా గొప్ప రచయితగా పేరు దక్కించుకున్నాడు టూబిన్​.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top