David Warner: 27 రోజుల తర్వాత ట్వీట్‌ చూసి షాక్‌.. వార్నర్‌ క్షమాపణ

David Warner Apologies Die Heard Fan Not Replying Tweet For 27 Days - Sakshi

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు క్రికెట్‌ను బ్యాలెన్స్‌ చేస్తూనే.. వీలున్నప్పుడల్లా వీడియోలతో అభిమానులను అలరిస్తుంటాడు. అంతేకాదు వార్నర్‌కు జాలిగుణం ఎక్కువ. ఎవరైనా కష్టం వచ్చింది అంటూ తనకు ట్వీట్‌ చేస్తే వెంటనే స్పందిస్తాడు. అలాంటి వార్నర్‌ మొదటిసారి ఒక అభిమాని ట్వీట్‌కు సకాలంలో స్పందించలేదు. 27 రోజుల తర్వాత ఆ ట్వీట్‌ను చూసి షాకైన వార్నర్‌.. తన వీరాభిమానికి క్షమాపణ చెప్పాడు.

చదవండి: 'చిన్ననాటి జ్ఞాపకాలు.. మా నాన్న షెడ్‌లో దొరికాయి'

విషయంలోకి వెళితే.. వేదాంతి హరీష్‌ కుమార్‌ డేవిడ్‌ వార్నర్‌కు డైహార్డ్‌ ఫ్యాన్‌. నవంబర్‌ 27న తొలిసారి ట్విటర్‌లో ''హాయ్‌.. హౌ ఆర్‌ యూ  వార్నర్‌..'' అంటూ ట్వీట్‌ చేశాడు. ఇలా ఒకటి.. రెండు రోజులు కాదు.. ఏకంగా 27 రోజుల పాటు ప్రతీరోజు వార్నర్‌కు ట్వీట్‌ పెడుతూనే ఉన్నాడు. కానీ యాషెస్‌ సిరీస్‌లో బిజీగా ఉన్న వార్నర్‌ హరీష్‌ కుమార్‌ ట్వీట్‌కు రిప్లై ఇవ్వలేదు. తాజాగా వార్నర్‌ తన వీరాభిమాని ట్వీట్‌ చూసి షాకయ్యాడు. ఆ తర్వాత వెంటనే.. ''సారీ.. ఎలా ఉన్నావు బ్రదర్‌'' అంటూ రీట్వీట్‌ చేశాడు. వార్నర్‌ నుంచి రిప్లై వచ్చిందని తెలియగానే ఎగిరి గంతేసిన హరీష్‌ కుమార్‌.. ''27 రోజులకు నన్ను గుర్తించావు.. థాంక్యూ వార్నర్‌ భయ్యా'' అంటూ కామెంట్‌ చేశాడు. ఇది చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌ వార్నర్‌ను ఫన్నీగా ట్రోల్‌ చేశారు.'' ఏంటి వార్నర్‌ భయ్యా రిప్లై ఇవ్వడానికి ఇంత సమయం పట్టిందా.. పాపం నీ వీరాభిమాని ఎంత ఫీలయ్యాడో'' అంటూ పేర్కొన్నారు.

ఇక యాషెస్‌ సిరీస్‌లో బిజీగా ఉన్న వార్నర్‌ బ్యాట్స్‌మన్‌గా దుమ్మురేపుతున్నాడు. తొలి టెస్టులో 94 పరుగులు చేసిన వార్నర్‌ రెండో టెస్టులోనూ 95 పరుగులు చేశాడు. రెండుసార్లు సెంచరీ మిచ్‌ చేసుకున్నప్పటికి వార్నర్‌ ఫామ్‌లో ఉండడం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం. ఇక వరుసగా రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది. డిసెంబర్‌ 26 నుంచి బాక్సింగ్‌ డే రోజున మూడోటెస్టు ప్రారంభం కానుంది.

చదవండి: మ్యాచ్‌ చివరి బంతికి ఊహించని ట్విస్ట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top