దివంగత సింగర్‌ కేకేకు క్షమాపణలు.. ఎలాంటి శత్రుత్వం లేదు | Sakshi
Sakshi News home page

Rupankar Bagchi KK: దివంగత సింగర్‌ కేకేకు క్షమాపణలు.. ఎలాంటి శత్రుత్వం లేదు

Published Sat, Jun 4 2022 1:59 PM

Bengali Singer Rupankar Bagchi Issues Apology To KK After Criticised - Sakshi

Bengali Singer Rupankar Bagchi Issues Apology To KK After Criticised: ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్‌ కున్నత్‌ (53) మరణంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర శోకంలో మునిగిపోయింది. వివిధ భాషల్లో కలుపుకుని సుమారు 800కు పైనే పాటలు పాడిన ఆయన మే 31 రాత్రి కోల్‌కతాలో ప్రదర్శన తర్వాత గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోని ఆయన అనేక భాషల్లో పాడి అందరి మనసులను గెలుచుకున్నారు. ఆయన మృతి పట్ల యావత్ సినీ లోకం సంతాపం తెలియజేసింది. అయితే ప్రముఖ బెంగాలీ గాయకుడు, గేయ రచయిత రూపాంకర్‌ బగ్చీ మాత్రం 'ఎవరు ఈ కేకే, ప్రాంతీయ సింగర్‌లను ప్రోత్సహించాలి' అంటూ వీడియో రూపంలో తన అక్కసును వెళ్లగక్కిన విషయం విదితమే. ఆయన మాటలకు అనేక మంది నెటిజన్స్‌ దుమ్మెత్తిపోశారు. 

అయితే తాజాగా రూపాంకర్‌ ఈ విషయంపై కేకేకు అతని కుటుంబానికి క్షమాపణలు తెలిపాడు. ఈ విషయాన్ని ప్రెస్‌ మీట్‌ నిర్వహించి బహిరంగంగా క్షమాపణలు కోరాడు. తను పోస్ట్‌ చేసిన వీడియోను కూడా డిలీట్‌ చేసినట్లు పేర్కొన్నాడు. 'కేకే కుటుంబానికి, నా వ్యాఖ్యలతో బాధపడిన ప్రతి ఒక్కరికీ చెప్పాలనుకుంటున్నాను. కేకేతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. బెంగాలీ పరిశ్రమకు చెందిన వారి కంటే దక్షిణ, పశ్చిమ భారతదేశానికి చెందిన గాయకులకు ఎక్కువ ప్రేమ, గుర్తింపు లభిస్తుందని మాత్రమే నేను చెప్పాలనుకున్నాను. 

చదవండి: కేకే ఎవరు? మాలాంటి గొప్ప సింగర్లు మీ కళ్లకు కనిపించడం లేదా?

ఇంత విద్వేశానికి గురవుతారని ఊహించలేదు. నా భార్యకు కూడా బెదిరింపు మెస్సేజ్‌లు వస్తున్నాయి. అందుకే కేకే కుటుంబ సభ్యులకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. నేను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఆ వీడియోను కూడా డిలీట్‌ చేశాను. కేకే ఇప్పుడు ఎక్కడ ఉన్న దేవుడు ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని ప్రెస్‌మీట్‌లో రూపాంకర్‌ బగ్చీ తెలిపాడు.  

Advertisement
 
Advertisement
 
Advertisement