క్షమాపణ చెప్పిన అస్సాం సీఎం.. శ్లోకంపై క్లారిటీ..

Himanta Sarma Apology After Row Over His Shloka Post - Sakshi

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ‘ఎక్స్’ ట్విటర్‌ వేదికగా క్షమాపణలు తెలిపారు. ఇటీవల ఆయన పోస్ట్‌ చేసిన ఓ భగవద్గీత శ్లోకం భావం వివాదంగా మారింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ.. రాష్ట్రంలో కులాల మధ్య అంతరాలను సృష్టిస్తున్నారని హిమంత బిశ్వశర్మపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈయన స్పందిస్తూ వివరణ ఇచ్చారు. 

‘తాను రోజు భగవద్గీత శ్లోకాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తాను. ఇప్పటి వరకు సుమారు 668 శ్లోకాలు పోస్ట్‌ చేశాను. అయితే ఇటీవల నా సోషల్‌ మీడియా టీం.. భగవద్గీతలోని చాప్టర్‌ 18లో ఉన్న 44వ శ్లోకాన్ని పోస్ట్‌ చేసింది. ఆ శ్లోకం అనువాద అర్థాన్ని తప్పుగా పోస్ట్‌ చేసింది. ఆ తప్పు నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్‌ను నేను వెంటనే డిలీట్‌ చేశాను. అస్సాం ఎప్పుడూ కులాలకు అతీతమైన సమాజాన్ని ప్రతిబింబిస్తూ ఉంటంది. దానికి మహాపురుష్ శ్రీమంత శంకరదేవకు నా కృతజ్ఞతలు. నేను డిలీట్‌ చేసిన పోస్ట్ వల్ల ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే.. వారికి ఇవే నా క్షమాపణలు’ అని సీఎం హిమంత బిశ్వశర్మ (ఎక్స్‌)ట్వీటర్‌ వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

అయితే సీఎం హిమంత ట్వీటర్‌ టీం మొదటగా పోస్ట్‌ చేసిన భగవద్గీత శ్లోకం.. ‘బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు సేవ చేయడమే శూద్రుల విధి’ అనే అర్థం వచ్చేలా ఉండటంతో ప్రతి పక్షాలు తీవ్రంగా ఖండిస్తూ విమర్శలు గుప్పించాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top