
న్యూఢిల్లీ: కొందరు రాజకీయ నేతల ప్రసంగాల్లో అప్పుడప్పుడు తప్పులు దొర్లుతుంటాయి. దీంతో వారు అభాసుపాలవుతుంటారు. తాజాగా సిక్కింనకు చెందిన కాంగ్రెస్ నేత ఇదేవిధమైన వివాదంలో చిక్కుకున్నారు. తరువాత క్షమాపణలు చెప్పడంతో పాటు పొరపాటున నోరు జారానని వివరణ కూడా ఇచ్చారు.
సిక్కిం కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్ సిక్కింను పొరుగు దేశం అని పేర్కొన్న ఒక వీడియో వెలుగులో రావడంతో అతని మాటలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. దీంతో అజోయ్ కుమార్ ఒక ప్రకటనలో తన నోరు జారడం వల్ల అలా జరిగిందంటూ క్షమాపణలు చెప్పారు. తాను విలేకరుల సమావేశంలో భారత్- పొరుగు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాల గురించి మాట్లాడుతూ, పొరపాటున సిక్కింను పొరుగు దేశంగా ప్రస్తావించాను. ఇది అనుకోకుండా జరిగిన మానవ తప్పిదమంటూ అజోయ్ కుమార్ తన తప్పుకు వివరణ ఇస్తూ క్షమాపణలు కోరారు.
The BJP Sikkim unit vehemently denounces the outrageous and ignorant statement made by INC leader Ajoy Kumar, who shockingly referred to Sikkim as a "neighboring country" during his press conference at AICC headquarters today. It is utterly deplorable that a former IPS officer… pic.twitter.com/Uwoi6gTyV4
— BJP Sikkim (@BJP4Sikkim) July 1, 2025
కాంగ్రెస్ నేత అజయ్‌కుమార్ తప్పుడు వ్యాఖ్యలను సిక్కిం బీజేపీ సిక్కిం యూనిట్ తీవ్రంగా ఖండించింది.. ఒక మాజీ ఐపీఎస్ అధికారి, పార్లమెంటు సభ్యుడైన అజయ్ కుమార్ భారతదేశ చరిత్ర భౌగోళిక స్వరూపంపై నిర్లక్ష్యం ప్రదర్శించడం విచారకరమని బీజేపీ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అవమానకరమైన తప్పులను నివారించేందుకు, వెంటనే పార్టీ నేతలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని సూచించింది. ఈ అంశంపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనవాలా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిన్నా అడుగుజాడలను అనుసరిస్తోందని, దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: ‘నితీష్‌కు తెలివే లేదు’: తేజస్వి సంచలన వ్యాఖ్యలు