
ప్రతీకాత్మక చిత్రం
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఒళ్లు గగుర్పొడిచే ఉదంతం చోటుచేసుకుంది. మహిళలపై తరచూ దారుణాలు చోటుచేసుకుంటున్నాయనే వార్తలు వినిపిస్తున్న ప్రస్తుత సమయంలో, తాజాగా దీనికి భిన్నంగా జరిగిన ఘటన అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ముంబైకి చెందిన 40 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలు తన దగ్గర చదువుకునే 16 ఏళ్ల విద్యార్ధికి ఆందోళన నిరోధక మందులు(యాంటీ యాంగ్జైటీ మందులు) ఇచ్చి, ఏడాది కాలంగా అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తోంది. ఈ విషయం బయటపడిన దరిమిలా పోలీసులు ఆ మహిళా ఉపాధ్యాయురాలిని అరెస్ట్ చేశారు. ఆమెపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పాక్సో)చట్టం, జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ) చట్టం, భారత శిక్షాస్మృతిలోని నిబంధనల కింద నేరాలను మోపారు.
పోలీసులు తెలిపిన ప్రకారం నిందితురాలు ఆంగ్ల ఉపాధ్యాయురాలు. బాధిత విద్యార్థి 11వ తరగతిలో ఉన్నప్పుడు అతనికి పాఠ్యాంశాలను బోధించారు. 2023 డిసెంబర్‌లో జరిగిన పాఠశాల వార్షికోత్సవం సమయంలో ఆ విద్యార్థికి ఆకర్షితురాలినైనట్లు ఆమె పోలీసులకు తెలిపింది. 2024 జనవరి నుంచి ఆ విద్యార్థితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది. తొలుత ఆమె ఆ బాలుడిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, లైంగికంగా వేధించేదని, తరువాత అతనికియాంటీ-యాంగ్జైటీ ముందులు ఇచ్చి లోబరుచుకునేదని పోలీసులు తెలిపారు.
అయితే ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు అతని ప్రవర్తనలో మార్పును గమనించి, ప్రశ్నించగా, అసలు విషయం బయటపడిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ విద్యార్థి త్వరలోనే పాఠశాల విద్య పూర్తి చేస్తాడన్న భావనతో అతని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని విస్మరించారు. ఈ ఏడాది ఆ విద్యార్థి 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే ఆ ఉపాధ్యాయురాలు తిరిగి అతనిపై వేధింపులు ప్రారంభించింది. దీంతో ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు ఆ ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: ఖరీదైన ఐదు టీవీలు, 14 ఏసీలు.. ఢిల్లీ సీఎం ఇంటి రెనోవేషన్ ఖర్చెంతంటే..