'దేశానికి క్షమాపణలు చెప్పండి' ఆదిపురుష్ టీంపై మహిళా ఎంపీ ఫైర్‌..

Team Uddhav Demands Adipurush Team Apologise To The Nation  - Sakshi

ఢిల్లీ: శివ్ సేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆదిపురుష్ సినిమా టీంపై విరుచుకుపడ్డారు. హిందూ పురాణమైన రామాయణానికి తగ్గట్టుగా సినిమాలో  డైలాగ్స్ లేవని ఆరోపించారు. చిత్ర బృందం దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

'డైలాగ్‌ రచయిత మనోజ్ముంతాషిర్, డైరెక్టర హోం రౌత్ దేశానికి క్షమాపణలు చెప్పాలి. డైలాగ్‌లు గౌరవప్రదంగా లేవు. ముఖ్యంగా హనుమంతుని డైలాగ్‌లు సరిగా లేవు. వినోదం పేరుతో హిందు దేవుళ్లపై తీసిన సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతినే భాషను వాడారు. మర్యాద పురుషోత్తమ రామునిపై సినిమా తీసి.. త్వరగా రిలీజ్ చేయాలని మర్యాదను మరిచారు' అని ప్రియాంక చతుర్వేది అన్నారు. 

మైథాలాజికల్ యాక్షన్ ఫిల్మ్‌ ఆదిపురుష్ శుక్రవారం రిలీజ్ అయింది. రూ.500 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రతీ షోలో ఓ సీటు హనుమంతుని కోసం ఉంటుందని దర్శకుడు హోం రౌత్ చెప్పారు. సినిమా బాలేదని చెప్పిన ప్రేక్షకులపై దాడులు జరిగిన సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సినిమాలో దృశ్యాలు ఉన్నాయని దిల్లీ హైకోర్టులో ఇప్పటికే హిందూ సంఘాలు ఫిర్యాదులు కూడా చేశాయి.   

ఇదీ చదవండి:మనోభావాలు దెబ్బతిన్నాయ్‌.. ఆదిపురుష్‌పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top