చూడగానే దేవుడిలా కనిపించాలి.. ఆదిపురుష్‌తో పోల్చకండి: అరుణ్ గోవిల్ | Famous Actor Arun Govil Comment On Ramayan And Prabhas' Adipurush | Sakshi
Sakshi News home page

చూడగానే దేవుడిలా కనిపించాలి.. ఆదిపురుష్‌తో పోల్చకండి: అరుణ్ గోవిల్

Feb 2 2026 11:21 AM | Updated on Feb 2 2026 11:40 AM

Famous Actor Arun Govil Comment On Ramayan And Prabhas' Adipurush

రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణ్‌ (1987–88) టెలివిజన్ సీరీస్‌ ఒకప్పుడు పాపులర్‌.. శ్రీరాముడి పాత్రలో అరుణ్ గోవిల్ మెప్పించారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎంపీగా ఉన్నారు. రామాయణ్‌ సీరియల్‌లో  శ్రీరాముడిగా కనిపించిన ఆయన పాత్రకు అపారమైన ప్రజాదరణను తెచ్చింది. ఆ పాత్ర కారణంగా ఆయనను ప్రజలు నిజ జీవితంలో కూడా "రాముడు" ఇలాగే ఉంటారేమోనని భావించారు. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న  కొత్త 'రామాయణ' మూవీతో పాటు ప్రభాస్‌ ఆదిపురుష్‌పై స్పందించారు.

బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘రామాయణ’. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు.  దశరథుడిగా అరుణ్ గోవిల్ నటిస్తున్నారు.

రామాయణ సినిమాకు సంబంధించి రాముడి లుక్‌లో రణ్‌బీర్ కపూర్ ఫోటో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది రామాయణ్‌ సీరియల్‌లోని అరుణ్ గోవిల్ రాముడి గెటప్‌తో పోల్చారు. ఈ అంశంపై ఆయన ఇలా స్పందించారు. ' రాముడి రూపం ఇలా ఉంటుంది అని ప్రేక్షకులు  ఒక అంచనాకు వచ్చినప్పుడు ఇలాంటి పోలికలు రావడం సహజం. ఈ క్రమంలోనే చాలామంది నన్ను రణ్‌బీర్‌తో పోలుస్తున్నారు. అందుకు ఎవరూ  బాధపడాల్సిన అవసరం లేదు.  దేవుడి పాత్రలో ఎవరైనా నటించాలంటే ఆ రూపం చాలా ముఖ్యమైనది. ప్రజలు మిమ్మల్ని చూడగానే దేవుడిలా కనిపించాలి. దేవుడు బహుశా ఇలాగే ఉంటాడేమో అనే భావన వారిలో కలగాలి.' అని  ఆయన అభిప్రాయపడ్డాడు.

ప్రభాస్ రాముడిగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్' బాక్సాఫీస్ వద్ద విమర్శలతో పాటు డిజాస్టర్‌గా నిలిచింది. రాముడి పాత్రతో పాటు రావణాసురుడి గెటప్‌ సరిగా లేదని చాలామంది తప్పుబట్టారు. ఈ క్రమంలో కొత్తగా రానున్న రామాయణ సినిమాను ఆదిపురుష్‌తో ఎట్టిపరిస్థితిల్లో పోల్చవద్దని అరుణ్ గోవిల్ కోరారు. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ, ఓం రౌత్‌ ఆదిపురుష్‌ మధ్య చాలా తేడా ఉంది. రేపొద్దున సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులకు ఈ విషయం అర్థం అవుతుందని ఆయన అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement