కార్నీ పర్యటన ప్రారంభం | Canadian Prime Minister Mark Carney Begins His India Visit | Sakshi
Sakshi News home page

కార్నీ పర్యటన ప్రారంభం

Feb 28 2026 5:10 AM | Updated on Feb 28 2026 5:10 AM

Canadian Prime Minister Mark Carney Begins His India Visit

సోమవారం మోదీతో భేటీ

న్యూఢిల్లీ: భారత్‌ ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అని కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ అన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం భారత్‌ చేరుకున్నారు. ఉన్నతాధికారుల బృందంతో కలిసి శుక్రవారం సాయంత్రం ముంబై విమానాశ్రయంలో దిగారు. అనంతరం పలువురు వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. ఆదివారం కార్నీ ఢిల్లీ చేరుకుంటారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. 

అనంతరం విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌తో కూడా భేటీ అవుతారు. 2023లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యానంతరం ఇరుదేశాల సంబంధాలు బాగా దెబ్బ తిన్న విషయం తెలిసిందే. వాటిని తిరిగి బలోపేతం చేసుకోవడంతో పాటు పలు రంగాల్లో నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడమే లక్ష్యంగా కార్నీ భారత్‌లో పర్యటిస్తున్నారు. భారత్, కెనడా వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా వాణిజ్యం, ఇంధనం, టెక్నాలజీ సహా పలు రంగాలపై ప్రధానులు లోతుగా చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ పేర్కొంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement