breaking news
Canadian Prime Minister
-
పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నాం
లండన్: పరమకిరాతకంగా వందల కొద్దీ బాంబులేస్తూ, భూతల దాడులుచేస్తూ పాలస్తీనియన్ల మరణశాసన రాస్తున్న ఇజ్రాయెల్‌పై ధర్మాగ్రహంతో బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గాజావాసులున్న భూభాగాన్ని స్వతంత్ర పాలస్తీనా దేశంగా అధికారికంగా గుర్తిస్తున్నట్లు ఈ మూడు దేశాలు ఆదివారం ప్రకటించాయి. పాలస్తీనాను దేశంగా అధికారికంగా గుర్తించొద్దని అమెరికా, ఇజ్రాయెల్‌ల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ బ్రిటన్ తన స్వీయనిర్ణయానికే కట్టుబడి ఉంటుందని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఆదివారం వ్యాఖ్యానించారు. తామూ పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఆదివారం ఒక పోస్ట్‌చేశారు. తాము సైతం పాలస్తీనాకే మద్దతు పలుకుతున్నట్లు ఆ్రస్టేలియా ఆదివారం ప్రకటించింది. కామన్వెల్త్ దేశాల మధ్య సమన్వయాన్ని పెంచే చర్యల్లో భాగంగా కెనడా, ఆ్రస్టేలియా, బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గాజాలో మరణమృదంగం మోగిస్తున్న ఇజ్రాయెల్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని సొంత లేబర్ పార్టీ నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో బ్రిటన్‌లో స్టార్మర్ సర్కార్ ఈ ప్రకటన వెలువరిచింది. కాల్పుల విరమణ, గాజాలో ఐరాస మానవతా సాయం అనుమతి, శాంతి స్థాపనకు ఇజ్రాయెల్ అడ్డు తగిలితే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని జూలైలోనే స్టార్మర్ ప్రకటించారు. ద్విదేశ పరిష్కారం ఉత్తమం ఈ మేరకు లండన్‌లోని ప్రధాని కార్యాలయం నుంచి స్టార్మర్ పేరిట ఒక వీడియో సందేశం వెలువడింది. ‘‘ పాలస్తీనియన్లకు అనుకూలంగా మాత్రమే నిర్ణయం తీసుకున్నాం. ఇది హమాస్ సాయుధ సంస్థకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం కాదు. భవిష్యత్తులో పాలస్తీనియన్ల ప్రభుత్వ పాలనలో బ్రిటన్ పాత్ర ఏమాత్రం ఉండదు. పాలస్తీనాలో శాంతియుత భవిత కోసం మనందరం కలసినడుద్దాం. హమాస్ చెరలోని బందీలను విడిపించుకుందాం. ఘర్షణలకు చరమగీతం పాడదాం. శాంతి, భద్రతలకు ద్విదేశ పరిష్కారం ఉత్తమం’’ అని స్టార్మర్ స్పష్టంచేశారు. 1917లో నాటి పాలస్తీనా భూభాగంపై ఏలిన బ్రిటన్ తదనంతరకాలంలో ఇజ్రాయెల్ ఆవిర్భావానికి పునాది రాయి వేసింది. అదే బ్రిటన్ ఇన్నాళ్ల తర్వాత పాలస్తానాను స్వతంత్ర దేశంగా ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే భారత్ సహా 140కిపైగా దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించినప్పటికీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో తీర్మానంచేసి ఐరాసతో స్వతంత్రదేశంగా ప్రకటన చేయించడంలో విఫలమయ్యాయి. అయితే ఈసారి ఆ దిశగా అడుగులుపడే అవకాశముందని తెలుస్తోంది. తప్పుబట్టిన నెతన్యాహూ ఆ్రస్టేలియా, యూకే, కెనడాల నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తప్పుబట్టారు. ‘‘మీరంతా పాలస్తీనాను దేశంగా గుర్తించినంతమాత్రాన సరిపోదు. దానిని వాస్తవరూపంలోకి తీసుకురావాలి. అది అసాధ్యం. పాలస్తీనాను గుర్తించడం అంటే 2023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్‌పై హమాస్ సాయుధుల మెరుపుదాడి, వందల మంది ఊచకోతను ఈ దేశాలన్నీ సమరి్థంచినట్లే. ఈ తాజా గుర్తింపు హమాస్‌కు మీరంతా ఇచ్చే బహుమతితో సమానం. జోర్డాన్ నదీ పశ్చిమాన పాలస్తీనా ఆవిర్భావాన్ని నేను సాధ్యంకానివ్వను. వచ్చే వారం అమెరికాలో పర్యటన, ట్రంప్‌తో భేటీ తర్వాత నా తదుపరి కార్యాచరణ వెల్లడిస్తా’’ అని నెతన్యాహూ అన్నారు. మొదటి ప్రపంచయుద్ధంలో ఓడిపోయాక ఓట్టొమన్ రాజ్యపతనం ఆరంభమైంది. అప్పటి నుంచి వందేళ్లపాటు పశ్చిమాసియా భౌగోళిక, రాజకీయాలపై ఫ్రాన్స్, బ్రిటన్ల ఆధిపత్యం కొనసాగింది. యూదుల కోసం ఒక దేశం అవసరమని చేసిన 1917లో చేసిన బాల్ఫోర్ తీర్మానాన్ని బ్రిటనే రచించింది. తీర్మానం మొదటిభాగాన్ని సవ్యంగా అమలుచేసిన బ్రిటన్ ఆ తర్వాత రెండో భాగాన్ని గాలికొదిలేసింది. పాలస్తీనియన్ల పౌర, మత హక్కులకు ఎలాంటి అవరోధాలు సృష్టించకూడదని రెండోభాగంలో తీర్మానించినా అది ఇజ్రాయెల్ కారణంగా అమలుకు నోచుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత బ్రిటన్ పాలస్తీనాను గుర్తించి గతంలో తాను చేసిన చారిత్రక తప్పిదాన్ని సరిచేసిందని రాయల్ యునైటెడ్ సరీ్వసెస్ ఇన్స్టిట్యూట్లో పరిశోధకుడు బెర్కూ ఒజ్సేలిక్ వ్యాఖ్యానించారు. -
పాలస్తీనాను గుర్తిస్తాం: కెనడా
ఒట్టావా: ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో పాలస్తీనాను గుర్తించే విషయంలో ఫ్రాన్స్, యూకేల బాటలో పయనించాలని కెనడా నిర్ణయించుకుంది. గాజాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న అరాచకాలకు నిరసనగా పాలస్తీనా దేశాన్ని గుర్తించాలనుకుంటున్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ బుధవారం ప్రకటించారు. శాంతియుతంగా చర్చల ద్వారా ఇజ్రాయెల్– పాలస్తీనా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తమకు నమ్మకం పోయిందని ఆయన వివరించారు. అందుకే సెప్టెంబర్‌లో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీ 80వ సెషన్లో పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని అనుకుంటున్నామన్నారు. అయితే, సంస్కరణలతో, 2026లో సాధారణ ఎన్నికలు జరిపేందుకు పాలస్తీనా అథారిటీ నుంచి గట్టి హామీ లభించాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో పాలస్తీనాలో హమాస్‌కు ఎటువంటి పాత్ర ఉండరాదని, ఎన్నికల్లో పాల్గొనరాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి బదులుగా శాంతిని కోరుకునే ప్రజలందరి కోసమే రెండు దేశాల విధానాన్ని బలపరుస్తున్నామని కార్నీ తెలిపారు. -
ఖలిస్తానీ బంధంలో కెనడా ప్రధాని కార్యాలయం
ఒట్టావా: భారత వ్యతిరేక శక్తులు కెనడాలో ఏకంగా అధికారవర్గంతోనూ అంటకాగాయన్న వాదనలు నిజమని నిర్ధారణ అయింది. జస్టిన్‌ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వంతో సంప్రతింపులు జరుపుతున్నామని భారత్‌లో నిషేధిత ఉగ్రసంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్, ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ తాజాగా ప్రకటించారు. కెనడా ప్రధాని కార్యాలయంతో గత రెండు, మూడేళ్లుగా ఉత్తరప్రత్యుత్తరాల తంతు కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. సీబీసీ న్యూస్ ముఖాముఖిలో ట్రూడోను పన్నూ పొగిడారు. ‘‘మీడియా సమావేశంలో ట్రూడో చేసిన ప్రకటనతో జాతి భద్రతకు, న్యాయం, చట్టం అమలుకు కెనడా ప్రభుత్వం ఎంతగా కట్టుబడిందో చాటిచెబుతోంది. పీఎం కార్యాలయంతో గత మూడేళ్లుగా సంప్రతింపులు జరుపుతున్నాం. కెనడాలో భారతీయ ఏజెంట్ల నిఘా నెట్వర్క్ గుట్టుమట్లను ప్రభుత్వానికి అందజేశాం. హర్దీప్ సింగ్ పన్నూ హత్యకు కెనడాలో భారత హైకమిషనర్ సంజయ్ వర్మ, అతని సిబ్బంది ఎలా కుట్ర పన్నారో, ఎలా అమలుచేశారో పీఎంఓకు తెలియజేశాం’’అని అన్నారు. కెనడాలో భారతీయ ఏజెంట్లు హింసను ఉసిగొల్పుతున్నారని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు చేసిన ఆరోపణలనే పన్నూ వల్లెవేయడం గమనార్హం. భారతీయ–కెనడియన్ పౌరులు కెనడా రాజ్యాంగాన్ని గౌరవించట్లేరని పన్నూ ఆరోపించారు. భారతీయ కెనడియన్లను దేశం విడిచిపోవాలని పన్నూ గతంలో హెచ్చరించారు. ‘‘కెనడా రాజ్యాంగాన్ని పాటించని మీరు కెనడాలో ఉండకూడదు. కెనడాను వదిలేసి భారత్‌కు వెళ్లిపొండి’అని గత ఏడాది ఇండో కెనడియన్ హిందువులను పన్నూ హెచ్చరించడం తెల్సిందే. -
Justin Trudeau: నిఘా సమాచారమే.. గట్టి ఆధారాల్లేవు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయముందని ఊదరగొట్టిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వెనక్కితగ్గారు. ఈ హత్యకు సంబంధించి నిఘా సమాచారాన్ని మాత్రమే భారత్‌తో పంచుకొన్నామని, ఎలాంటి ఆధారాలను అందజేయలేదని విదేశీ జోక్యపు ఎంక్వైరీ ముందు బుధవారం హాజరైనపుడు అంగీకరించారు. నిజ్జర్ హత్య కేసులో భారత రాయబారి ప్రమేయముందని కెనడా ఆరోపించడంతో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిని.. దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకునే దాకా పరిస్థితి వెళ్లిన విషయం తెలిసిందే. ‘భారత్‌ను సహకరించాల్సిందిగా కోరాం. ఆధారాలు చూపమన్నారు. భారత నిఘా సంస్థలు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లి మాకు సహకరించాలని కోరాం. ఎందుకంటే ఈ దశలో కెనడా దగ్గరున్నది కేవలం నిఘా సమాచారం మాత్రమే’ అని ఎంకైర్వీ ముందు ట్రూడో చెప్పుకొచ్చారు. ‘జి20 సమావేశాల ముగింపు సమయంలో నేనీ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తెచ్చాను. భారత్ ప్రమేయముందని మాకు తెలుసని చెప్పాను. కెనడాలో చాలామంది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వారందరినీ అరెస్టు చేయాలని కోరారు. జి20 సదస్సు నుంచి కెనడాకు తిరిగి వచ్చేసరికి భారత్ అసలు ఉద్దేశం సుస్పష్టమైంది. కెనడాను విమర్శించడం, మన ప్రజాస్వామ్యపు సమగ్రతను ప్రశ్నించడమే వారి అసలు ఉద్దేశం’ అని ట్రూడో ఎంక్వైరీ ముందు చెప్పారు.లేవంటూనే.. మళ్లీ పాతపాటనిఘా సమాచారం తప్పితే.. గట్టి ఆధారాలు అందజేయలేదని ఒకవైపు చెబుతూనే ట్రూడో మళ్లీ పాతపాట పాడారు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు తమ వద్ద విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయని ఎంక్వైరీ కమిటీ ముందు ట్రూడో బుధవారం పునరుద్ఘాటించారు. భారత రాయబారులు కెనడా పౌరుల సమాచారం సేకరించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చేరవేస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఇవే ఆరోపణలు చేసినపుడు భారత్ గట్టిగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయంపై ఏ చిన్న ఆధారాన్ని కూడా కెనడా అందజేయలేదని విదేశాంగశాఖ పేర్కొంది. పలుమార్లు విజ్ఞప్తి చేసిన కెనడా స్పందించలేదని దుయ్యబట్టింది. కెనడా గడ్డపై వేర్పాటువాద శక్తులను కట్టడి చేయడానికి ఆ దేశం ఏమీ చేయడం లేదని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ట్రూడో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేసింది. -
కెనడా ప్రధాని ట్రూడో నోట మళ్లీ పాత పాటే..
సిక్కు వేర్పాటువాది, ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతం ఒక్కసారిగా భారత్, కెనడా దౌత్యసంబంధాల్లో మంటలు రాజేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ ఆదివారం భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం పంపింది. ఇక.. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించింది. అంతేకాకుండా కెనడా నుంచి దౌత్యాధికారులను భారత్ వెనక్కి రప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో స్పందించారు. కెనడాలో నేర కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా భారత ప్రభుత్వం.. ప్రాథమిక తప్పు చేసిందని ఆరోపించారు. ఒట్టావాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను ఎత్తిచూపారు. సింగపూర్‌లో ఈ వారాంతంలో షెడ్యూల్ చేయబడిన జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ప్రాముఖ్యతను తెలిపారు. గత వారం చివరలో నేను భారత ప్రధాని మోదీతో మాట్లాడిన సమయంలో ఈ వారాంతంలో సింగపూర్‌లో జాతీయ భద్రతా సలహాదారుల ముఖ్యమైన సమావేశం జరగబోతోందని తెలిపారు. ఆ సమావేశం గురించి మోదీకి కూడా తెలుసు. అయితే ఆ సమావేశం అవసరమని నేను తెలియజేశా. అదేవిధంగా ఈ సమావేశాన్ని చాలా చాలా సీరియస్‌గా తీసుకోవాలని అన్నాను.#WATCH | Ottawa: Canadian PM Justin Trudeau says, "When I spoke to PM Modi at the end of last week, I highlighted how incredibly important meeting between our national security advisors in Singapore this weekend was going to be. He was aware of that meeting and I pressed upon him… pic.twitter.com/RvKMN2Trzg— ANI (@ANI) October 14, 2024..కెనడియన్ గడ్డపై, హత్య, దోపిడీ పాటు, కెనడియన్లకు వ్యతిరేకంగా నేర కార్యకలాపాలకు మద్దతు ఇవ్వగలమని భావించడంలో భారత ప్రభుత్వం ప్రాథమిక తప్పు చేసింది. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు.అయితే.. ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్‌తో కలిసి పనిచేయడానికి కెనడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇరుదేశాల మధ్య ఘర్షణ సృష్టించటం కెనడా ఉద్దేశం కాదు. భారతదేశం ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య దేశం. భారత్‌తో కెనడాకు వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నాం. .. అందుకే మేము ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ద్వారా హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఉందా లేదా అనే విషయంపై విచారణ ప్రారంభించాం. నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉన్నట్లు మాకు తెలుసు. ఈ విషయంలో పరిష్కరించటంలో భారత్ మాతో కలిసి పని చేయాలి. మేము ఈ పోరాటం చేయవద్దని అనుకుంటున్నాం. కానీ కెనడియన్ గడ్డపై ఓ వ్యక్తిని చంపటం ఒక దేశంగా మేము విస్మరించలేని విషయం’’ అని అన్నారు.చదవండి: భగ్గుమన్న దౌత్య బంధం -
భారత్‌తో ఒప్పందాలు అప్పుడే..! కెనడా మంత్రి కీలక వ్యాఖ్యలు
శాన్ఫ్రాన్సిస్కో: కెనడా-భారత్ సంబంధాలపై ఆ దేశ ఆర్థిక మంత్రి మేరీ ఎన్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యకేసు దర్యాప్తులో భారత్ సహకరించిన తర్వాతే వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ఉంటాయని తెలిపారు. నిజ్జర్ హత్యకేసులో దర్యాప్తును భారత్ తోసిపుచ్చడం లేదని విదేశాంగ మంత్రి జై శంకర్ గురువారం తెలిపిన విషయం తెలిసిందే. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సమావేశానికి హాజరైన కెనడా ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి మేరీ ఎన్జీ మీడియాతో మాట్లాడుతూ.. "మా దృష్టంతా నిజ్జర్ కేసు దర్యాప్తుపైనే ఉంది. అందుకు భారత్ సహకరించేలా చేయడంపైనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ పని పూర్తైన తర్వాతే ఇరుదేశాల మధ్య సంబంధాల గురించి ఆలోచిస్తాం. మా దేశానికి చెందిన వ్యక్తి హత్యలో విదేశీ జోక్యం ఉందని ఆరోపణలు రావడాన్ని సీరియస్‌గా తీసుకున్నాం.' అని అయన చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదానికి దారి తీసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపిస్తోందని భారత్ దుయ్యబట్టింది. ఈ పరిణామాల తర్వాత ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలతోపాటు వీసాలను కూడా రద్దు చేసుకున్నారు. ఈ కేసులో భారత్ దర్యాప్తుకు సహకరించాలని కెనడా ఒత్తిడి చేస్తోంది. ఇదీ చదవండి: ఖలిస్తానీల ఆగడాలను అడ్డుకోండి -
సన్నిహిత సంబంధాలకే మొగ్గు: ట్రూడో
టొరంటో: ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా మారి, ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌తో సన్నిహిత సంబంధాలను మెరు గుపర్చుకునేందుకు కట్టుబడి ఉన్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. అదేసమయంలో, ఖలిస్తాన్ వేర్పాటువాది నిజ్జర్ హత్య ఘటనకు సంబంధించిన వాస్తవాల వెల్లడిలో సహకారానికి భారత్ ముందుకురావాలని కోరారు. భారత్‌పై బలమైన ఆరోపణలున్నప్పటికీ సన్నిహితంగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. మాంట్రియల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రపంచ వేదికపై కీలకంగా మారిన భారత్‌తో కెనడా, మిత్ర దేశాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో ఉందని భావిస్తున్నా. ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ అంతర్జాతీయ రాజకీయాల్లో తనవంతు పాత్ర పోషిస్తోంది. అందుకే భారత్‌తో సన్నిహిత సంబంధాల కొనసాగింపునకు కట్టుబడి ఉన్నాం’అని చెప్పారు. అదే సమయంలో చట్టపాలన కలిగిన దేశంగా, నిజ్జర్ హత్యకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు భారత్ తమతో కలిసి పని చేయాలని భావిస్తున్నామన్నారు. భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్‌తో వాషింగ్టన్లో జరిగే సమావేశంలో ఇదే విషయాన్ని బ్లింకెన్ ప్రస్తావిస్తారని కూడా బైడెన్ ప్రభుత్వం చెప్పిందన్నారు. -
ట్రూడో టార్గెట్‌గా ఆందోళనలు
టొరెంటో: కరోనా టీకా తప్పనిసరి నిబంధన, కోవిడ్ నిబంధనల పాటింపును వ్యతిరేకిస్తున్నవారి నిరసనలు కెనెడాలో పెరిగిపోయాయి. ఆందోళనకారులు రాజధాని నగరంలో ర్యాలీలు నిర్వహించడంతో పాటు పార్లమెంట్ హిల్ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. కొందరు నిరసనకారులు జాతీయ మృతవీరుల స్మారకాన్ని అవమానించడం, సైనికుల సమాధిపై డ్యాన్సులు చేయడం వంటి వికృత చర్యలకు పాల్పడుతున్నారు. కొందరు ఆందోళనకారులు స్వస్తిక్ గుర్తున్న ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. వీరికి దేశీయుల నుంచి పెద్దగా సానుభూతి లభించకున్నా వీరు మాత్రం ఆందోళనలు ఆపడం లేదు. ఇలాంటివారి సంఖ్య స్వల్పమని, అబద్ధాలను వీళ్లు ప్రచారం చేస్తున్నారని కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో దుయ్యబట్టారు. కేవలం టీకా తప్పనిసరి నిబంధనలు ఎత్తివేయడంతో తమ నిరసన ఆగదని, ట్రూడో ప్రభుత్వం రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనల్లో చాలా నిబంధనలను ప్రావిన్సుల్లోని ప్రభుత్వాలు విధించినా నిరసనకారులు మాత్రం ట్రూడో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. -
సౌదీ యువతికి కెనడా ఆశ్రయం
టొరంటో/బ్యాంకాక్: థాయిలాండ్‌లో చిక్కుకుపోయిన సౌదీఅరేబియా యువతి రహాఫ్ ముహమ్మద్ అల్‌ఖునన్(18) శనివారం ఎట్టకేలకు కెనడాకు చేరుకుంది. ఇంట్లో వేధింపులు తట్టుకోలేక థాయ్‌లాండ్‌కు పారిపోయివచ్చిన రహాఫ్‌కు ఆశ్రయమిస్తామని కెనడా ప్రధాని ట్రూడో ప్రకటించడం తెల్సిందే. ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ చొరవతోనే ఇది సాకారమైందని థాయ్‌లాండ్ ఇమ్మిగ్రేషన్ ముఖ్య అధికారి సురాచత్ హక్‌పర్న్ తెలిపారు. సౌదీకి చెందిన రహాఫ్ మహ్మద్ అల్‌ఖునన్ తల్లిదండ్రుల ఆంక్షలను తట్టుకోలేక, తనకు నచ్చినట్టుగా బతికేందుకు కువైట్ నుంచి థాయ్‌లాండ్ మీదుగా ఆస్ట్రేలియాకు పారిపోయేందుకు యత్నించారు. అయితే తగిన పత్రాలు లేకపోవడంతో రహాఫ్‌ను జనవరి 5న థాయ్‌లాండ్ అధికారులు ఎయిర్‌పోర్టులోనే ఆపేశారు. దీంతో బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ హోటల్ గదిలో దాక్కుని తన పరిస్థితిని సోషల్‌మీడియా ద్వారా ఐరాస, మీడియా దృష్టికి తీసుకెళ్లారు. రహాఫ్‌కు ఆశ్రయం కల్పించే విషయమై ఆస్ట్రేలియా, కెనడా సహా పలు దేశాలతో ఐరాస చర్చించింది. అయితే వేగంగా స్పందించిన కెనడా తాము రహాఫ్‌కు ఆశ్రయం కల్పిస్తామని ప్రకటించగా, అందుకు ఆమె అంగీకరించారు. కాగా, ఈ విషయంలో తనకు సాయం చేసిన ప్రతీఒక్కరికి రహాఫ్ కృతజ్ఞతలు తెలిపారు. కెనడా ప్రభుత్వ తాజా నిర్ణయంతో సౌదీతో ఆ దేశ సంబంధాలు మరింత దిగజారనున్నాయి. ఇంతకుముందు సౌదీలో మహిళా హక్కుల కార్యకర్తలకు మద్దతు పలకడంతో కెనడాపై సౌదీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. -
తాజ్ ముందు ట్రూడో.. ఫొటోలో టవల్‌తో కేజ్రీవాల్!
సాక్షి, న్యూఢిల్లీ : తాజాగా భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆదివారం తాజ్‌మహల్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. ప్రేమకు ప్రతిరూపమైన తాజ్‌మహల్ ఎదుట ట్రూడూ భార్య, పిల్లలతో కలిసి ఫొటోలు దిగారు. అయితే, ఈ ఫొటోలో ఓ పొరపాటు కాంగ్రెస్ నేత శశి థరూర్ కంటబడింది. ఆయన ఆనందభరితలయ్యారు. వెంటనే ట్వీట్ చేశారు. తాజ్‌మహల్ ముందు ట్రూడో కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలో స్విమ్మింగ్ దుస్తులతో ఉన్న ఓ వ్యక్తి పడగలిగాడు. ఏకంగా ప్రధాని ఫొటోలో ఫొటోబాంబ్ అయ్యాడు’ అని శశి ట్వీట్ చేశారు. నిజానికి శశి ట్వీట్ చేసిన ఆ ఫొటోలో ట్రూడో కుటుంబం వెనుక ఉన్నది ఎవరో కాదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తాజ్ ముందు ట్రూడో ఫ్యామిలీ ఫొటోలో ఆయన టవల్లో ఉన్నట్టు ఎవరో ఫొటోషాప్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించకుండా నిజమైన ఫొటోనేమోనని థరూర్ అనుకున్నారు. తర్వాత ఆయన సారీ చెప్పారు. అది ఫొటోషాప్ చేసిన చిత్రమని గుర్తించలేకపోయానని, సోషల్ మీడియాలో నిజంగా అనిపించే చిత్రాలను కూడా నమ్మలేమని ఆయన ట్వీట్ చేశారు. Sir who photoshopped this? And is this man arvind kejriwal? — Wasi Mohammad (@WasiMd110) 18 February 2018 -
దీపావళి ముబారక్
ఒట్టావా : దీపావళి పర్వదినం ససందర్భంగా హిందువులకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రడువ్ మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపిన.. ఆయన అందులో పేర్కొన్న ఒక పదం వివాదాస్పదంగా మారింది. వేల మంది ఆయనపై విమర్శల జడివాన కురిపిస్తున్నారు. ఇంతకూ ఆయన తన ట్విటర్లో ఏమన్నారంటే... ’’ హిందువులందరికీ దీపావళి ముబారక్‘‘ అని చెప్పారు. నలుపు రంగు షేర్వానీలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఫొటో పెట్టి.. దీపావళి శుభాకాంక్షలు అని పోస్ట్ చేశారు. అంతేకాక ఒట్టావాలో రాత్రి దీపావళిని ఉత్సాహంగా జరుపుకుంటాం అని అందులో పేర్కొన్నారు. జస్టిన్ ట్రడువ్ ట్వీట్‌ను 3 లక్షల మంది లైక్ చేశారు. ఇదాఇలా ఉండగా.. ఈ ట్వీట్‌పై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. దీపావళి పండుగకు శుభాకాంక్షలు చెప్పినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు.. అందుఏలో ముబారక్ అనే పదాన్ని తొలంగించండి అని కొందరు.. రీ ట్వీట్ చేశారు. మరికొందరైతే ముబారక్ అనేది అరబిక్ పదం.. దానిని హిందువులకు ఎలా ఆపాదిస్తారు? అని ప్రశ్నించారు. Diwali Mubarak! We're celebrating in Ottawa tonight. #HappyDiwali! pic.twitter.com/HBFlQUBhWX — Justin Trudeau (@JustinTrudeau) 17 October 2017 -
మీ ప్రధాని ఇలా చేయగలడా?
పరిపాలనా సంగతులు ఎలాఉన్నా ఇతర వ్యాపకాలతో మీడియా దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు కొందరు దేశాధినేతలు. గుర్రపుస్వారీ చేయటమో, బైక్ పై దూసుకెళ్లటమో, ప్రోటోకాల్ పక్కన పెట్టి నలుగురితో కలిసి చిందులెయ్యటమో లేక లక్షల రూపాయల సూట్లు ధరించడమో.. లాంటివి చేస్తూ జనం, మీడియా దృష్టిని ఆకర్షిస్తూంటారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికన్ ప్రెసిడెంట్ బారక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీలు ఆయా సందర్భాల్లో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడీ జాబితాలో కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రుడెయు కూడా చేరిపోయారు. 44 ఏళ్లకే ఉత్తరఅమెరికా ఖండంలోని అతిపెద్ద దేశమైన కెనడాకు ప్రధానిగా ఎన్నికయిన జస్టిన్.. రాజకీయాల్లోకి రాకముందు అథ్లెట్. స్నో బోర్డింగ్, యోగాల్లో విశేష ప్రావిణ్యం సాధించారు. ఎన్నికల ప్రచారంలోనూ చంటిపిల్లల్ని ఒంటిచేత్తో పైకెత్తి తన ప్రతిభచాటుకున్నారు. ఉత్సాహవంతుడైన జస్టిన్ తన కార్యాలయంలోని టేబుల్ పై పీకాక్ పోజ్ (మయూరాసనం) వేసిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి ఈ ఫొటో మూడేళ్ల కిందటిది. 2013, ఏప్రిల్ లో జస్టిన్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. అయితే ఆయన అభిమానులు కొందరు ఆ పాత ఫొటోను మళ్లీ రీట్వీట్ చేయడంతో ఇప్పుడిది వైరల్ అయింది. ఫొటోతోపాటు 'మీ దేశ ప్రధాని ఇలా చెయ్యగలడా?' అంటూ జస్టిన్ అభిమానులైన కెనడియన్లు నెటిజన్లను ప్రశ్నిస్తున్నారు. మరి మీరేం బదులిస్తారు?