సారీ... కోకో! | Sabalenka apologizes to French Open champion Coco Gauff | Sakshi
Sakshi News home page

సారీ... కోకో!

Jun 18 2025 1:49 AM | Updated on Jun 18 2025 2:14 PM

 Sabalenka apologizes to French Open champion Coco Gauff

ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ను క్షమాపణ కోరిన రన్నరప్‌ సబలెంకా

ఫైనల్‌ అనంతర వ్యాఖ్యలపై లేఖ  

బెర్లిన్‌: తాజా ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ కోకో గాఫ్‌కు ప్రపంచ నంబర్‌వన్‌ ప్లేయర్‌ సబలెంకా (బెలారస్‌) క్షమాపణలు చెప్పింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ కోసం ఇద్దరు తలపడగా... అమెరికన్‌ స్టార్‌ కోకో గాఫ్‌ విజేతగా నిలిచింది. మ్యాచ్‌ అనంతరం రన్నరప్‌ సబలెంకా మాట్లాడుతూ... తన స్వీయ తప్పిదాల వల్లే ప్రత్యర్థి గెలిచిందని, విజయంలో గాఫ్‌ పాత్రలేదన్నట్లుగా వ్యాఖ్యానించింది. మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ విజేత అయిన సబలెంకా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. దీంతో క్షమాపణలు కోరుతూ సబలెంకా లేఖ రాసింది. 

‘నా వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఓ విజేతను ఉద్దేశించి అలా మాట్లాడాల్సింది కాదు. నా భావోద్వేగాలను నియంత్రించుకుని ఉంటే బాగుండేది. గాఫ్‌ను క్షమాపణలు కోరుతున్నాను. మనుషులందరూ పొరపాట్లు చేస్తుంటారు. జీవితంలో నేర్చుకునే దశలో ఉన్న నేను కూడా అంతే. తదనంతరం నేను మాట్లాడిన మాటలు నన్నే కలత పెట్టాయి. ముమ్మాటికి ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచే అర్హత గాఫ్‌కే ఉంది. ఆమె విజయాన్ని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నా’ అని లేఖలో పేర్కొంది. 

నిజానికి గాఫ్‌పై మాటలతో దాడి చేయాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పింది. మ్యాచ్‌ ముగిసిన వెంటనే మీడియా సమావేశం జరగడం... ఫలితంతో నిరాశలో ఉన్న తాను అలా మాట్లాడాల్సి వ చ్చిందని వివరణ ఇ చ్చింది. ‘ఎప్పుడైనా సరై ప్రత్యరి్థని గౌరవించే నాకు ఇలా చిన్నబుచ్చే వ్యాఖ్యలు చేయడం పట్ల మనస్తాపం చెందాను. అందుకే మన్నించమని విజ్ఞప్తి చేస్తున్నాను. జీవితంలో నేను ఎప్పటికి గుర్తుంచుకోవాల్సిన పాఠం ఇది’ అని సబలెంకా తెలిపింది. 

బెలారస్‌ స్టార్, ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకా రెండు ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ (2023, 2024) టైటిల్స్‌తో పాటు ఒక యూఎస్‌ ఓపెన్‌ (2024) ట్రోఫీ గెలుచుకుంది. అయితే ప్రపంచ రెండో ర్యాంకర్‌ కోకో గాఫ్‌తో జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో తడబడింది. ఏకంగా 70 అనవసర తప్పిదాలు చేసింది. గాఫ్‌ మాత్రం 30 తప్పిదాలే చేసి టైటిల్‌ విజేతగా నిలిచింది. కోకో గాఫ్‌ 2023లో సబలెంకాపైనే గెలిచి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ కూడా సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement