Twitter Outage: చాలా గ్యాప్​ తర్వాత ట్విటర్​ సేవలకు అంతరాయం! కారణం ఏంటంటే..

Twitter Outage: Twitter Apologies To Users On Technical Bug - Sakshi

సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ల సేవల్లో అంతరాయం ఈరోజుల్లో సాధారణమైపోయింది. అయితే ఈ విషయంలో మిగతా వాటితో పోలిస్తే ట్విటర్​ కొంచెం మెరుగు అనే అభిప్రాయం ఉంది యూజర్లలో. అందుకే వేరే ఏదైనా ప్లాట్​ఫామ్​ సేవలకు ఇబ్బంది అయినప్పుడు.. ట్విటర్​లో చెడుగుడు ఆడేసుకుంటారు. కానీ, ఇప్పుడు సీన్​ రివర్స్​ అయ్యింది.
 
చాలా కాలం తర్వాత ట్విట్టర్ పిట్ట కూత ఆగిపోయింది. గంటల వ్యవధిపాటు సేవలు నిలిచిపోయాయి. దీంతో యూజర్లు నానా అవస్థలు పడ్డారు. గత రాత్రి(శుక్రవారం) 11 గంటల నుంచి గంటపాటు ట్వీట్ చేయడంలో యూజర్లు ఇబ్బంది పడ్డారు. భారత్‌లోనూ ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయి.
 

 సమస్య ఏంటంటే..
ఈ అంతరాయంపై స్పందించిన ట్విట్టర్ వెంటనే సేవలను పునరుద్ధరించింది. సాంకేతిక సమస్యల(టెక్నికల్​ బగ్​) కారణంగానే సేవలకు అంతరాయం కలిగినట్టు తెలిపింది. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలని వేడుకుంది. ట్విటర్​ తిరిగి సేవలు ప్రారంభించగానే.. ట్విటర్​నే ట్రోల్​ చేస్తూ పలువురు ట్వీట్లు చేయడం కొసమెరుపు.

మొబైల్ మాత్రమే కాదు వెబ్‌సైట్‌లోనూ ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ మొరాయించింది. లోడింగ్ సమస్యతోపాటు పోస్టింగ్‌లు చేయలేకపోయామని, లాగిన్ కూడా కాలేకపోయామని పలువురు ఫిర్యాదులు చేశారు. ట్విట్టర్‌ను ఉపయోగిస్తుండగానే మధ్యలోనే అది లాగౌట్ అయిందని మరికొందరు తెలిపారు. డౌన్​డిటెక్టర్​ అనే ట్రాక్​ ప్రకారం.. సుమారు 48 వేలకు పైనే ఫిర్యాదులు అందాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top