
దీర్ఘాయువు కావాలా? దీనిపై లవ్ అండ్ కేర్ ఉండాలి మరి!
ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలంటే అనేక అంశాలు పనిచేస్తాయి. సమతులం ఆహారం, ఒత్తిడి లేని జీవితం, సరియైన నిద్ర చాలా అవసరం. దీంతోపాటు మన శరీరంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని అవయవం ఒకటి ఉంది. ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ డేనియల్ అమెన్ దీనికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.
మానసిక వైద్యుడు డాక్టర్ డేనియల్ అమెన్ ప్రకారం, ఆరోగ్యం విషయంలో చాలామంది చేసే అతి పెద్ద తప్పు వారి బ్రెయిన్ గురించి పట్టుకోకవడం. మెదడు ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యంగా ఉండటం మనిషి ఆయుష్షుమీద ప్రభావం చూపుతుంది. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, నిర్ణయాలు , దీర్ఘాయువును కూడా నియంత్రించే అవయవం అయినా , మెదడు ఆరోగ్యం తరచుగా రోజువారీ జీవితంలో దాని గురించి విస్మరిస్తున్నారు అంటారాయన.
తాజాగా దీర్ఘాయువు పరిశోధకుడు డాన్ బ్యూట్నర్‌తో ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ పాడ్‌కాస్ట్ లైవ్ టు 100 లో మాట్లాడుతూ తన అనుభవాన్ని పంచుకున్నారు. తన కెరీర్‌లో 2 లక్షలకు పైగా మెదడు స్కాన్‌లను అధ్యయనం చేసిన డాక్టర్ అమెన్, మెదడుతో సంబంధాన్ని పెంచుకోవడం దాని కనుగుణంగా మలుచుకోవడం చాలా ముఖ్యం అన్నారు.
తన సొంత మెదడు స్కాన్ నుండి మేల్కొలుపు కాల్
డాక్టర్ అమెన్ ఒక అగ్రశ్రేణి న్యూరోసైన్స్ విద్యార్థిగా మరియు బోర్డు-సర్టిఫైడ్ మనోరోగ వైద్యుడిగా కూడా, 1990ల ప్రారంభం వరకు తాను మెదడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశానని ఒప్పుకున్నారు. తన క్లినిక్‌లలో బ్రెయిన్ ఇమేజింగ్‌ను ప్రవేశపెట్టి, 1991లో తన సొంత మెదడును స్కాన్ చేసినప్పుడు, దిగ్భ్రాంతికర ఫలితాలు చూశానని చెప్పుకొచ్చారు.
1990 కి ముందు తనకు అధిక బరువు రాత్రిపూట నాలుగు గంటలు మాత్రమే నిద్రపోవడం లాంటి చెడు అలవాట్లు ఉండేవని , తన బ్రెయన్ హెల్త్ గురించి ఎపుడూ ఆలోచించలేదని గుర్తు చేసుకున్నారు. కానీ పరిశోధనలకు ఒక మేల్కొలుపుగా పనిచేశాయని, తన జీవనశైలిని కరెక్ట్ నిద్ర, ఆహారం,రోజువారీ అలవాట్లను మార్చుకున్నట్టు వెల్లడించారు.
మెదడు ఆరోగ్యం- దీర్ఘాయువు, "బ్లూ జోన్స్" (ప్రజలు అసాధారణంగా ఎక్కువ కాలం జీవించే ప్రాంతాలు) ఆలోచనను ప్రాచుర్యంలోకి తెచ్చిన డాన్ బ్యూట్నర్, మంచి జీవనశైలి అనేది గుండె, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినట్టుగానే, మెదడు ఆరోగ్యం అనేది దీర్ఘాయువులో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. రోజువారీ అలవాట్లు అభిజ్ఞా క్షీణత, చిత్తవైకల్యం,మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి, అలాగే మెదడును ముందుగానే రక్షించడం అనేది దీర్ఘకాలిక శ్రేయస్సులో చాలా కీలకమన్నారు. దీనికి సంబంధించి డాక్టర్ అమెన్ రాసిన "చేంజ్ యువర్ బ్రెయిన్, చేంజ్ యువర్ పెయిన్" అనే పుస్తకంలో మరిన్ని విషయాలను పొందుపర్చారు.
మెదడు ఆరోగ్యం, డా. అమెన్ సలహాలు
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని, ఆక్సిజన్‌ను సరఫరాను పెంచుతుంది. వ్యాయామంలో పట్టిన చెమట హానికరమైన సమ్మేళనాలను తొలగించడంలో సహాయపడుతుంది
మెదడు చురుగ్గా ఉండేలా, చాలెంజింగ్ ఫజిల్స్ పరిష్కరించాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.
ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు, వాల్‌నట్‌లు, అవిసె గింజలు . కొవ్వు చేపలు మెదడు కణాలకు మేలు ఇస్తాయి
చక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలు మెదడు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. వీటికి దూరంగా ఉండాలి.
కుటుంబంలో అల్జీమర్స్ వంటి పరిస్థితులు ఉంటే ముందుగానే అప్రమత్తం కావాలి.
7–8 గంటలు ల నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. మెదడు తనను తాను శుభ్రపరుచుకునే సమయం నిద్ర.
తల గాయాల నుండి రక్షించుకోవడం.
మద్యం ,మాదకద్రవ్యాలకు దూరండా ఉండాలి.ఘీ టాక్సిన్స్ న్యూరాన్‌లను దెబ్బతీస్తాయి
నెగిటివ్ ఆలోచనలు మెడదుకు హాని చేస్తాయి.
విటమిన్ డి , హార్మోన్ స్థాయిలను సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.
మెదడు పట్ల లవ్ అండ్ కేర్ గా ఉండాలి. దానికి కీడు చేసే పనులు మానుకోవాలి అంటారు డా. అమెన్.