
మేషం: మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వివాదాలు పరిష్కారం. నూతన ఉద్యోగలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
వృషభం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆధ్యాత్మిక చింతన. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో మార్పులు.
మిథునం: మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పకపోవచ్చు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో పనిభారం.
కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. వాహనాలు, భూములు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు.
సింహం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. పనులలో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు.
కన్య: కొన్ని పనులు వాయిదా వేస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులు మరింత శ్రమపడాలి. ప్రయాణాలలో మార్పులు. స్వల్ప అనారోగ్యం. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.
తుల: వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వివాదాల పరిష్కారం. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకోని పదోన్నతులు.
ధనుస్సు: దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్య సూచనలు. బంధువుల కలయిక. విచిత్ర సంఘటనలు. నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
మకరం: ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. భూములు, ఇళ్ల కొనుగోలు. విద్యావకాశాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రగతి.
కుంభం: మిత్రులు, బంధువులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.
మీనం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. సోదరులతో సఖ్యత. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.