గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: బ.సప్తమి ప.11.11 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం: హస్త సా.6.37 వరకు తదుపరి చిత్త, వర్జ్యం: రా.3.11 నుండి 4.55 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.38 నుండి 8.04 వరకు,అమృత ఘడియలు: ప.12.14 నుండి 1.56 వరకు.
సూర్యోదయం : 6.37
సూర్యాస్తమయం : 5.38
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. రుణబాధలు తొలగుతాయి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.
వృషభం: కుటుంబసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు.
మిథునం: కొన్ని సమస్యలు సవాలుగా మారతాయి. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ముఖ్యమైన పనులు వాయిదా. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.
కర్కాటకం: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం. శుభవార్తలు. రుణబాధలు తొలగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.
సింహం: దూరప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. కొత్తగా రుణయత్నాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం తగ్గుతుంది.
కన్య: ఎంతటి పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. భూవ్యవహారాలలో కొత్త ఆశలు. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
తుల: ప్రయాణాలలో మార్పులు. స్వల్ప అనారోగ్యం. శ్రమాధిక్యం. ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. రుణదాతల ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
వృశ్చికం: కొన్ని వ్యవహారాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
ధనుస్సు: పనులలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.
మకరం: పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
కుంభం: పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. బంధువర్గంతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఒత్తిడులు.
మీనం: పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా సాగుతారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.


