
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’ అక్టోబర్ 10న విడుదలకు సిద్ధమైంది. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించిన ఈ చిత్రానికి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. శనివారం జరిగిన ప్రెస్ మీట్‌లో చిత్ర బృందం సినిమా విశేషాలను పంచుకుంది.
హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ.. “మూడేళ్ల క్రితం నిర్మాత తేజ గారు ఈ కథ చెప్పారు. మొదట్లో కథ అర్థం కాలేదు, కానీ సీన్స్ నచ్చాయి. ఫాదర్-సన్ ఎమోషనల్ సీన్స్ తెలుగులో ఇంతవరకు రాని విధంగా ఉన్నాయి. శ్రీమాన్ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. గోదావరి జిల్లాల విజువల్స్ అద్భుతంగా చిత్రీకరించిన కెమెరామెన్ సాయి కుమార్, శర్వా మ్యూజిక్, అనుదీప్ ఆర్ఆర్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. అశ్లీలత లేకుండా నిజాయితీగా మంచి సినిమా చేశాం. థియేటర్ నుంచి ఆనందంతో బయటకు వస్తారు’ అన్నారు
దర్శకుడు సాయి మోహన్: ‘ఇండస్ట్రీలోకి రావాలన్నది మా నాన్న కల. నన్ను నమ్మిన తేజకి, గౌరీకి థాంక్స్. సాయి కుమార్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. కోమలి నా రచనకు మించి నటించారు. శ్రీమాన్ సింగిల్ షాట్ సీన్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. అక్టోబర్ 10న అందరూ సినిమా చూసి సపోర్ట్ చేయాలి’ అన్నారు.
‘శశివదనే’ నాకు ప్రత్యేకమైన చిత్రం. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. అందరూ థియేటర్లో చూడాలి’ అని హీరోయిన్ కోమలి అన్నారు.