
విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే రష్మికనే గుర్తొస్తుంది. ఎందుకంటే కలిసి రెండు సినిమాలే చేశారు. వాటి రిజల్ట్ సంగతి పక్కనబెడితే వీళ్లిద్దరి మధ్య బాండింగ్ కొనసాగుతూనే ఉంది. గత కొన్నాళ్లలో అయితే తమ మధ్య రిలేషన్ గురించి చిన్న చిన్న హింట్స్ ఇస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది వీళ్లిద్దరి పెళ్లి ఉండొచ్చేనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. సరే ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా వీళ్లిద్దరూ ఓ కొత్త మూవీ మొదలుపెట్టేశారని తెలుస్తోంది.
విజయ్ దేవరకొండకు గత కొన్నాళ్లుగా అస్సలు కలిసి రావట్లేదు. రీసెంట్‌గానే 'కింగ్డమ్'తో వచ్చాడు. కానీ పెద్దగా ఫలితం మారలేదు. మరీ తీసికట్టుగా లేనప్పటికీ టాక్ యావరేజ్‌గా, వసూళ్లు కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. దీంతో కొత్త చిత్రంపై ఫోకస్ పెట్టేశాడు. గతంలో విజయ్ దేవరకొండతోనే 'ట్యాక్సీవాలా' తీసిన రాహుల్ సంక్రిత్యాన్.. చాన్నాళ్ల క్రితమే ఇతడితో మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
(ఇదీ చదవండి: పెళ్లైన 13 ఏళ్లకు తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్)
ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో సోమవారం పెద్దగా హడావుడి లేకుండానే ప్రారంభించేశారట. విజయ్ దేవరకొండ సరసన ఇందులో రష్మిక హీరోయిన్‌గా చేస్తోంది. 1870 టైమ్‌లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. 'ద మమ్మీ' ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడట.
గతంలో విజయ్-రష్మిక జంటగా గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు చేశారు. అవి ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి జంటగా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే రష్మిక.. పాన్ ఇండియా సినిమాలతో హిట్స్ కొడుతోంది. ఇప్పుడు ఏకంగా రూమర్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ దేవరకొండతోనే కలిసి నటిస్తోంది.
(ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న కండల వీరుడు.. ఈసారి అవార్డ్ ఖాయం)