
WWE మాజీ స్టార్, నటుడు డ్వెన్ జాన్సన్ (ది రాక్) కండలు తిరిగిన దేహంతో ఉండే హాలీవుడ్ నటుడు. రెజ్లర్‌గానే కాకుండా నటుడిగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నాడు. WWEలో ఏకంగా 10 సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా సత్తా చాటాడు. అయితే, ఒక నటుడిగా కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన 'ది స్మాషింగ్ మెషిన్' సినిమా వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. సినిమా చూసిన వారందరూ సుమారు 15 నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. దీంతో చిత్ర యూనిట్ మొత్తం భావోద్వేగానికి గురైంది.
పోరాట యోధుడి జీవితంపై సినిమా
90ల నాటి పోరాట యోధుడు మార్క్ కెర్ (Mark Kerr) అనే వ్యక్తి MMA (Mixed Martial Arts) ప్రపంచంలో ఒక లెజెండరీ ఫైటర్‌గా గుర్తింపు పొందాడు. ఆయన జీవితం ఆధారంగానే 'ది స్మాషింగ్ మెషిన్' చిత్రాన్ని దర్శకుడు బెన్నీ సాఫ్డీ తెరకెక్కించారు. మార్క్ కెర్ పాత్రలో డ్వెన్ జాన్సన్(Dwayne Johnson ) అదరగొట్టాడు. ఈ సినిమా మార్క్ కెర్ జీవితంలోని గెలుపులు, ఓటములతో పటు అతని ఒపియాయిడ్ వ్యసనం వల్ల ఎదురైన వ్యక్తిగత సమస్యలను హృదయాన్ని తాకే విధంగా చూపిస్తుంది. ఇది కేవలం పోరాటం గురించి మాత్రమే కాదు.. అతని అంతర్గత పోరాటం గురించి కూడా ఈ చిత్రంలో చూపించారు. మార్క్ కెర్‌తో పాటు డ్వెన్ జాన్సన్‌లకు కూడా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో సినిమా చూసిన వారు తప్పకుండా కన్నీళ్లు పెట్టుకుంటారని చెబుతున్నారు.

ఆస్కార్ ఖాయం
డ్వేన్ జాన్సన్ నటన అద్భుతం అంటూ ఈ సినిమాలో తన పాత్రను చూసి విమర్శకుల ప్రశంసలు పొందుతున్నాడు. క్లాసిక్ స్పోర్ట్స్ డ్రామాగా చరిత్రలో నిలిచిపోతుందని చెబుతున్నారు. అక్టోబర్ 3న అమెరికాలో మొదట ఈ చిత్రం విడుదల కానుంది. ఫాస్ట్ & ఫ్యూరియస్ సిరీస్, జుమాన్జీ, మోనా, బ్లాక్ ఆడమ్ వంటి చిత్రాల్లో నటించిన డ్వేన్ ఇప్పటికీ ఒక్క ఆస్కార్ అవార్డ్ కూడా సొంతం చేసుకోలేదు. అయితే, 'ది స్మాషింగ్ మెషిన్' చిత్రంతో ఆయన తప్పకుండా ఈసారి ఆస్కార్ అందుకుంటాడని సినిమా చూసిన వారు చెప్పేశారు.
కన్నీళ్లు పెట్టుకున్న డ్వేన్ జాన్సన్
వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'ది స్మాషింగ్ మెషిన్' చిత్రాన్ని తాజాగా ప్రదర్శించారు. సినిమా చూసిన వారందరూ దాదాపు 15 నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. దీంతో డ్వేన్ జాన్సన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మార్క్ కెర్ పాత్రలో డ్వేన్ అద్భుతంగా నటించాడంటూ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో నటుడు డ్వేన్ జాన్సన్ కూడా భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ క్షణంలో సహనటి ఎమిలీ బ్లంట్, దర్శకుడు బెన్నీ సఫ్డీ అతన్ని ఓదార్చారు.
Dwayne Johnson's 'The Smashing Machine' explodes onto Rotten Tomatoes with a flawless 100% score
critics are calling it his all-time greatest performance!
Might not return back to the ring!
Oscar buzz is real. 😭🏆 #TheSmashingMachine pic.twitter.com/yEoMM7MvyZ— Azam Sajjad (@AzamDON) September 2, 2025