
హాలీవుడ్ రేంజ్‌లో ‘ది ప్యారడైజ్’ సినిమా రూపొందుతోంది. ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తు్తన్నారు. తాజాగా ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీ ‘కనెక్ట్ మాబ్ సీన్’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసెడింట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ హెడ్ అలెగ్జాండ్రా ఈ. విస్కోంటిని ‘ది ప్యారడైజ్’ టీమ్‌ని కలిసి, ఈ సినిమాతో కొలాబరేట్ కావడానికి చర్చలు జరిపారు.
అలాగే ఈ సినిమా ఇంటర్‌నేషనల్ వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ఓ హాలీవుడ్ నటుడితో కూడా ఈ చిత్రం యూనిట్ చర్చలు జరుపుతోంది. ఇక ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్... ఇలా మొత్తం ఎనిమిది భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.