అన్నగారు థియేటర్లకు వచ్చే తేదీ ఖరారైపోయింది. కార్తీ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘వా వాత్తియార్’. ఈ చిత్రం ‘అన్నగారు వస్తారు’ టైటిల్‌తో తెలుగులో రిలీజ్ కానుంది. ఈ నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రనిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా బుధవారం ప్రకటించారు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కృతీ శెట్టి కథానాయికగా నటించారు.
ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన విషయాన్ని ప్రకటించి, ‘అన్నగారు’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. సంగీతదర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించగా, ఎస్.పి. అభిషేక్, హరిప్రియ ఆలపించారు. ‘‘అన్నగారు, అన్నగారు... ఆల్రెడీ నే రిచ్ కిడ్డు, పాన్ ఇండియా మూవీ ΄్లాన్ చేశా, రాజమౌళికి ఫోన్ చేసి నా మీద బయోపిక్ ఒకటి తీయమంటున్న...’ అంటూ కలర్‌ఫుల్ మేకింగ్‌తో ఈ పాట అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు.


