కార్తీ హీరోగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘వా వాత్తియార్’. ఈ చిత్రం ‘అన్నగారు వస్తారు’ టైటిల్‌తో తెలుగులో విడుదల కానుంది. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబరులో విడుదల చేయనున్నట్లు బుధవారం నిర్మాత ప్రకటించారు. ‘‘యాక్షన్ కామెడీ కథతో రూ΄÷ందిస్తున్న ఈ చిత్రంలో కార్తీ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్‌ని అలరించేలా ‘అన్నగారు వస్తారు’ ఉంటుంది. కార్తీ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది’’ అని యూనిట్ పేర్కొంది.


