
టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ (Renu Desai) ఆస్పత్రికి వెళ్లింది. అనారోగ్యంతోనో, అస్వస్థతకు గురయ్యో కాదు.. రేబిస్ టీకా వేయించుకోవడానికి హాస్పిటల్‌కు వెళ్లింది. రేణూ దేశాయ్.. జంతు సంరక్షణ, వీధి కుక్కల సంక్షేమం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తుందన్న విషయం తెలిసిందే! ఈ క్రమంలో కొన్నిసార్లు మూగజీవాలు తనను గీరడం, కొరకడం వంటివి చేస్తున్నాయట!
అందుకోసమే ఈ వీడియో
అందుకని రేబిస్, టెటానస్ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలిపింది. రేబిస్ టీకా తీసుకునేటప్పుడు ఎన్నడూ ఫోటోలు, వీడియోలు తీయలేదు. అసలు ఆ ఆలోచన కూడా రాలేదు. కానీ, అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈసారి టీకా తీసుకున్నప్పుడు ఇలా వీడియో రికార్డ్ చేశాను అంటూ సదరు వీడియోను షేర్ చేసింది.
ఏడ్చేసిన నటి
రేణూ దేశాయ్.. రెండు రోజుల క్రితం జబ్బు పడి ఉన్న కుక్కను కాపాడింది. ఆ శునకం పరిస్థితి చూసి రేణూ కన్నీళ్లు పెట్టుకుంది. వీటిని కాపాడే క్రమంలో నాకో విషయం అర్థమైంది. ఇటువంటి పనులకు ఇంకా చాలామంది వలంటీర్లు కావాలి. మనుషులుగా మనం తోటి మానవులతో పాటు ఇతర జాతులను కూడా కాపాడుకోవాలి అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. రేణూ చివరగా టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కనిపించింది.
చదవండి: మాధురికి క్లాస్ పీకిన నాగార్జున.. తీరు మార్చుకోమని హెచ్చరిక!