
‘‘నేను సక్సెస్ చూశాను. ఫెయిల్యూర్స్ కూడా చూశాను. సో... వీటి విషయంలో పరిణతి చెందాను. కానీ విజయం వచ్చిన ప్రతిసారీ చాలా పాజిటివ్‌గా ఉంటుంది. నా సినిమా వస్తే బాగుంటుందనే ఇమేజ్‌ను ప్రేక్షకుల నుంచి తెచ్చుకోవాలన్నదే నా ప్రయత్నం. ‘కె–ర్యాంప్’ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు’’ అని కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) అన్నారు. ఆయన హీరోగా, యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘కె–ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం నేడు (అక్టోబర్ 18న) విడుదలవుతోంది.
ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. ‘‘కె–ర్యాంప్’లాంటి సినిమా వచ్చి చాలా రోజులైంది. క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్ ఇది. ఇందులో కుమార్ అనే పాత్ర చేశాను. ఈ సినిమా ఫస్టాఫ్ యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఎంగేజ్ చేస్తుంది’’ అని అన్నారు. ‘‘పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా ఇది. ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులను ఈ సినిమా రిఫ్లెక్ట్ చేస్తుంది’’ అని తెలిపారు వీకే నరేశ్. ‘‘ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేసుకుని, సినిమా చేశాను’’ అన్నారు జైన్స్ నాని. ‘‘ఈ చిత్రంలో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను’’ అని పేర్కొన్నారు యుక్తీ తరేజా.