‘కె-ర్యాంప్‌’ మూవీ ట్విటర్‌ రివ్యూ | K Ramp Movie Twitter Review And Public Talk | Sakshi
Sakshi News home page

K Ramp X Review: ‘కె-ర్యాంప్‌’ ట్విటర్‌ రివ్యూ.. కిరణ్‌ మూవీకి ఊహించని టాక్‌

Oct 18 2025 6:44 AM | Updated on Oct 18 2025 9:17 AM

K Ramp Movie Twitter Review And Public Talk

గతేడాది దీపావళికి ‘క’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న కిరణ్‌ అబ్బవరం..ఈ సారి ‘కె-ర్యాంప్‌’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జైన్స్‌ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది.ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మించిన ఈ చిత్రం నేడు(అక్టోబర్‌ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘కె-ర్యాంప్‌’ ఎలా ఉంది? కిరణ్‌ ఖాతాలో మరో హిట్‌ పడిందా లేదా ? తదితర అంశాలను ఎక్స్‌లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి.


ఎక్స్‌లో కె-ర్యాంప్‌ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వినిస్తుంది. సినిమా బాగుందని, కిరణ్‌కి భారీ విజయం సాధించిందని కొంతమంది అంటుంటే.. బాగోలేదని మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు.


ఈ పండక్కి మంచి ఫన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా ఇది. ఈ మూవీకి కిరణ్‌ వన్‌మ్యాన్‌ షో. మాస్‌ సెంటర్‌ ఆడియన్స్‌ సినిమా బాగా ఎక్కేస్తుంది. సెకండాఫ్‌ని దర్శకుడు బాగా డీల్‌ చేశాడు. డైలాగ్స్‌ మరో ప్రధాన బలం’ అంటూ ఓ నెటిజన్‌ 3 రేటింగ్‌ ఇచ్చాడు.

 ఓవరాల్‌గా సినిమా బాగుంది.ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. సెకండాఫ్‌ పబ్‌ సీన్‌ బాగుంది. ఈ దిపావళి కూడా కిరణ్‌ అబ్బవరందే అంటూ మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు.

 ప్రారంభం నుంచి ముగింపు వరకు ఓవర్‌ ది టాప్‌గా ఉండే ఒక సిల్లీ చిత్రమిది. ఇలాంటి కథలను మనం చాలా వరకు చూశాం. కేవలం వినోదాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే క్రింజ్‌గానే అనిపిస్తుంది. కొన్ని కామెడీ సీన్లను దర్శకుడు బాగా డీల్‌ చేశాడు. మిగిలి రచన పేలవంగా ఉంది అంటూ ఓ నెటిజన్‌ 2 రేటింగ్‌ మాత్రమే ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement