
నచ్చిన డిజర్ట్ కళ్ల ముందు ఊరిస్తుంటే ఎవరికైనా నోరారా ఆరగించాలని అనిపిస్తుంది. రష్మికా మందన్నాకూ అలానే అనిపించింది. కానీ రష్మిక తినలేని పరిస్థితి. ఎందుకంటే... ప్రస్తుతం రష్మికా మందన్నా ఓ స్పెషల్ డైట్‌ను ఫాలో అవుతున్నారట. ఇందులో భాగంగా జిమ్‌లో స్పెషల్ వర్కౌట్స్ చేస్తున్నారు. అలాగే ఈ డైట్ మెనూలో రోజూ స్వీట్ తినకూడదు. దీంతో తన కళ్ల ముందు ఉన్న డిజర్ట్‌ను తినలేక పోతున్నానన్న బాధను ఎక్స్‌ప్రెస్ చేస్తూ, ‘డియర్ డిజర్ట్... నువ్వు ఎప్పటికీ నా దానివే.
కానీ ఈ రోజు కాదు’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో రష్మిక ఓ వీడియోను షేర్ చేయగా, వైరల్ అవుతోంది. ‘‘ఫిట్‌నెస్ కారణంగా సినిమా స్టార్స్ తమకు ఇష్టమైన ఆహారానికి దూరం కావాల్సిందే. ముఖ్యంగా హీరోయిన్స్ మెరుపు తీగలా ఉండటం కోసం నచ్చిన ఆహారాన్ని త్యాగం చేస్తారు... ఇలాంటి త్యాగాలు తప్పవు’’ అని నెటిజన్లు స్పందిస్తున్నారు.
ఇక రష్మికా మందన్నా నటించిన హిందీ చిత్రం ‘థామా’ ఈ నెల 24న విడుదల కానుంది. అలాగే రష్మిక లీడ్ రోల్ చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబరు 7న రిలీజ్ కానుంది. అలాగే ‘మైసా’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్, హిందీలో ‘కాక్‌టైల్ 2’తో పాటు మరో రెండు సినిమాలతో రష్మిక ఎప్పటిలానే బిజీ బిజీ.