
మిగతా ఇండస్ట్రీల మాదిరిగా సినీ పరిశ్రమ ఓ పద్ధతి ప్రకారం లేదు. ఇక్కడ పనిగంటలు కరెక్ట్‌గా ఉండవు. అన్నిచోట్లా ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఎనిమిది గంటలు పనిచేసే విధానాన్ని అనుసరించాలని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. చిన్న, మధ్యతరహా సినిమాలకు ఈ డిమాండ్లు సెట్ అవుతాయేమో కానీ భారీ బడ్జెట్ చిత్రాలకు వీటిని ఫాలో అవడం కష్టం!
దీపికా.. నాకు చాలా ఇష్టం
ఈ కారణం వల్లే స్పిరిట్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలు దీపిక చేజారిపోయాయి. దీపిక డిమాండ్ గురించి తాజాగా అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే (Shalini Pandey) స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నాకు దీపికా పదుకొణె అంటే చాలా ఇష్టం. స్కూల్‌లో చదువుకునే రోజుల నుంచి తనను చూస్తున్నాను. ఆమె జర్నీని ఫాలో అయ్యాను. తనొక గొప్ప యాక్టర్. తనకు ఏది అవసరమో దాని గురించి నిర్భయంగా మాట్లాడుతుంది. మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని నొక్కి చెప్పింది. తనవల్లే మేమందరం మానసిక ఆరోగ్యం గురించి ఓపెన్‌గా మాట్లాడగలుగుతున్నాం.
సినిమా
తను కోరుకున్నది తనకు దక్కాల్సిందేనని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చింది. అటు కొంకణ సేన్ శర్మ మాట్లాడుతూ.. మేమేం సర్జరీ చేసే డాక్టర్స్ కాదు కదా.. మేమూ మనుషులమే! మాకూ చిన్నపాటి బ్రేక్స్ కావాలి అని పేర్కొంది. షాలిని పాండే తొలి చిత్రం అర్జున్ రెడ్డితో బాగా పాపులర్ అయింది. తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్‌లోనూ తళుక్కుమని మెరిసింది. ధనుష్ ఇడ్లీ కొట్టు మూవీలో కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తోంది.
చదవండి: ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్‌రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి